పవర్ స్టీరింగ్ 'టాటా నానో ట్విస్ట్'పై మరిన్ని డిటేల్స్
టాటా నానోలో పవర్ స్టీరింగ్ వెర్షన్ (నానో ట్విస్ట్)ను కంపెనీ వచ్చే జనవరిలో(15వ తేదీన) విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కొత్త 2014 టాటా నానో ట్విస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!
- ప్రస్తుతం లభిస్తున్న రెగ్యులర్ టాటా నానో కారుతో పాటుగా ఈ కొత్త 2014 టాటా నానో ట్విస్ట్ (పవర్ స్టీరింగ్ వెర్షన్)ను కూడా ఆఫర్ చేస్తారు.
- పవర్ స్టీరింగ్ కలిగిన టాటా నానో ట్విస్ట్ రెగ్యులర్ టాటా నానో ధర కన్నా సుమారు రూ.15,000 అధికంగా ఉండొచ్చని అంచనా.
- నానో ట్విస్ట్‌లో ఉపయోగించనున్న పవర్ స్టీరింగ్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ కంపెనీ జెడ్ఎఫ్ ఫ్రీడ్రిచ్‌సాఫెన్ నుంచి సేకరిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్.
- టాటా నానో ట్విస్ట్‌ను ఎక్స్ఈ, ఎక్స్‌టి అనే రెండు వేరియంట్లలో ఆఫర్ చేయనున్నారు. ఈ రెండు వేరియంట్లు ప్రస్తుత సిఎక్స్, ఎల్ఎక్స్ మాదిరిగానే ఉంటాయి. వీటిల్లో కేవలం పవర్ స్టీరింగ్ ఫీచర్ మాత్రమే భిన్నంగా ఉంటుంది.
- నానో ట్విస్ట్ కొత్త పర్పల్ బాడీ కలర్‌లో లభ్యం కానుంది.



Click it and Unblock the Notifications








