ఢిల్లీ పోలీస్ కార్ అవతారమెత్తిన టాటా నానో

By Ravi

అప్పుడెప్పుడో ముంబై పోలీసులు పెట్రోలింగ్ కోసం టాటా నానో కారును ఉపయోగిస్తున్నారనే వార్తను విన్నాం గుర్తుందా..? ఇప్పుడు అలాంటి మరో స్టోరీ తెరపైకి వచ్చింది. ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా రికార్డు సృష్టించిన 'టాటా నానో' కారును ఢిల్లీ పోలీస్ ఎమర్జెన్సీ రెస్పాన్సివ్ వెహికల్‌గా ఉపయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఇలాంటి వాహనాన్ని ఉపయోగించనున్నారు.

ఈ నేపథ్యంలో, దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ఓ పోలీస్ వెర్షన్ నానో కారును ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 'ఇండియా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్‌‌పో'లో ప్రదర్శనకు ఉంచింది. ఓ తెలుపు రంగు నానో కారును ఢిల్లీ పోలీస్ లోగోలతో మరియు బ్లూ, రెడ్ కలర్‌ బాడీ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేశారు. ఈ కారును కేంద్ర హోం సెక్రటరీ అనీల్ గోస్వామి ఆవిష్కరించారు.

Tata Nano

ఢిల్లీ వీధుల్లో మహిళలకు, చిన్న పిల్లలకు సంరంక్షణ కల్పించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ వెహికల్‌గా ఈ వాహనాన్ని ఉపయోగించే సాధ్యాసాధ్యాలను టాటా మోటార్స్ వివరించింది. ఈ వాహనాలను మహిళా పోలీసులు సులువుగా డ్రైవ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అత్యవసర పరిస్థితుల కోసం ఉపయోగిస్తున్న పెద్ద పిసిఆర్ వాహనాలకు బదులుగా చిన్న కారును ఉపయోగించే కాన్సెప్ట్‌ను పరిచయం చేశామని గ్రాండ్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మోంటీ సింగ్ తెలిపారు.

పోలీసుల కోసం కస్టమైజ్ చేసిన ఈ టాటా నానో కారులో, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించేందుకు గాను ఇందులో మెడికల్ గ్యాడ్జెట్స్, ఇతర ఫస్ట్ ఎయిడ్ యాక్ససరీస్ వంటి పరికరాలను అమర్చారు. ఈ కారుకు పై భాగంలో బ్లేరింగ్ సైరెన్, సెర్చ్ లైట్స్ కూడా ఉంటాయి. ఈ ఎక్స్‌పోలో మొత్తం 92 ఎగ్జిబిటర్లు సెక్యూరిటీ, సర్వైవలెన్స్ అండ్ సేఫ్టీకి సంబంధించిన గ్యాడ్జెట్లను, పరికరాలను, వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ షో సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతుంది. మరి నచ్చిందా ఈ పోలీస్ నానో..?

More from DriveSpark

Article Published On: Friday, September 27, 2013, 16:51 [IST]
English summary
Tata Motors small car Nano was today unveiled in a new avatar, as the new probable Delhi Police emergency response vehicle to cater to women and children in distress. The curtains of the white car, embossed with Delhi Police logos, were taken off by Union Home Secretary Anil Goswami who inaugurated the four-day 'India International Security Expo' at Pragati Maidan in Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+