6000 యూనిట్ల బుకింగ్‌లను దాటిన టాటా సఫారీ స్టోర్మ్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లో అందిస్తున్న సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ అంచనాలకు మించి అమ్ముడుపోతుంది. సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఇటు క్లాస్ డ్రైవింగ్‌కే కాకుండా అటు ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్లకు సైతం చక్కగా సూట్ అవుతుంది. మరింత స్టయిలిష్‌గా సరికొత్త స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి వచ్చిన టాటా సఫారీ స్టోర్మ్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైన కొద్ది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
టాటా మోటార్స్ ఈ కొత్త అప్‌గ్రేడెడ్ సఫారీని తొలిసారిగా గడచిన సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిందిం. లగ్జరీ, కంఫర్ట్, పవర్, సుప్రీం ఆఫ్-రోడింగ్ పెర్ఫామెన్స్‌ల కలయికతో కంపెనీ ఈ కొత్త సఫారీ స్టోర్మ్‌ను రూపొందించింది. ఇందులో శక్తివంతమైన 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త సఫారీ స్టోర్మ్ కేవలం 15 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ (4x4), టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఫోర్-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 13.2 కి.మీ. మైలేజీని, టూ-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 14 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ సఫారీ స్టోర్మ్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఇది అర్బన్ బ్రాంజ్స సార్డినియా రెడ్, పెరల్ వైట్, పెరల్ షాంపైన్, ఏస్టర్న్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఆర్కిటిక్ సిల్వర్ అనే ఏడు ఆకర్షనీమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








