జూన్‌లో మూడు కొత్త కార్లను విడుదల చేయనున్న టాటా
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈనెలలో మూడు కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేయనుంది. టాటా మోటార్స్ అందిస్తున్న సుమో గోల్డ్, ఇండిగో ఈసిఎస్ మరియు ప్రజల కారు నానో మోడళ్లలో రిఫ్రెష్ చేయబడిన అప్‌గ్రేడెడ్ వెర్షన్లను కంపెనీ విడుదల చేయనుంది. అంతేకాకుండా కంపెనీ అందిస్తున్న టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలో, ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం పూర్తి కిట్లతో కూడిన ఓ స్పెషల్ వేరియంట్‌ను కూడా టాటా మోటార్స్ విడుదల చేసే ఆస్కారం ఉంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మోడళ్లు జూన్ 19న మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. టాటా సుమో గోల్డ్ ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్లలో కాస్మోటిక్ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటికి అధనంగా బ్లూటూత్ కనెక్టివిటీ, వెనుక సీట్లలోని ప్రయాణికుల కోసం రియర్ ఏసి, అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉండనున్నాయి.

అలాగే, టాటా ఇండిగో ఈసిఎస్‌లో ఇంటీరియర్ అప్‌డేట్స్ ఉండనున్నాయి. గేర్ బాక్సును మరింత స్మూత్‌గా ఉండేలా అభివృద్ధి చేశారు. ఇకపోతే గడచిన సంవత్సరం ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచిన టాటా సఫారీ స్టోర్మ్ ఆఫ్-రోడింగ్ వెర్షన్‌ను టాటా మోటార్స్ ఇప్పుడు వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిస్థాయి యాక్ససరీలతో ఈ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేయనున్నారు.
వీటితో పాటుగా ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్ టాటా నానో కూడా అదే రోజున విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ టాటా నానోకు కాస్మోటిక్ మార్పులు చేయబడిన ఫేస్‌లిఫ్ట్ వెర్షనా లేక సిఎన్‌జి/డీజివ్ వెర్షనా అనేది తెలియాల్సింది. ఇందుకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








