పాత టూవీలర్‍‌తో రండి కొత్త టాటా నానోతో వెళ్లండి!

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు అలుపెరగని విక్రమార్కుడిలా, పట్టువిదలని భగీరదుడిలా అనేక ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇటీవలే టాటా నానో కోసం క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ ఇప్పుడు నానో కోసం ఆకర్షనీమైన ఎక్సేంజ్ ఆఫర్‌ను పరిచయం చేసింది.

పాత ద్విచక్ర వాహనాన్ని తీసుకురండి, సరికొత్త టాటా నానో కారులో వెళ్లండి అంటూ, టాటా మోటార్స్ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదైనా పాత ద్విచక్ర వాహనాన్ని ఎక్సేంజ్ చేసుకుంటే టాటా మోటార్స్ తమ నానోపై రూ.15,000 తగ్గింపును ఆఫర్ చేస్తుంది. అదే ఏదైనా పాత ఫోర్ వీలర్‌ను ఎక్సేంజ్ చేసుకుంటే కొత్త నానోపై రూ.40,000 తగ్గింపును అందిస్తోంది.

Tata Tries To Push Nano Sales With Exchange Offer

వాస్తవానికి టాటా మోటార్స్ గతంలోనే నానో కోసం ఎక్సేంజ్ ఆఫర్‌ను అందించింది, కానీ అది అంత సక్సెస్ కాలేకపోయింది. కాగా.. తాజా ఆఫర్‌తోనైనా టాటా నానో అమ్మకాలు పుంజుకుంటాయో లేదో చూడాలి. గతంతో పోల్చుకుంటే టాటా నానో అమ్మకాలు భారీగా క్షీణించాయి. దీంతో గుజరాత్‌లోని నానో కారు ప్లాంటులో వీటి స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది.

మీరు నిజంగా నానో కారు కొనాలని భావిస్తే, ఇప్పుడు నానో కారును కొనకపోవటమే ఉత్తమం. ఎందుకంటే, టాటా మోటార్స్ నానోలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేయబోతుంది. ప్రస్తుతం లభిస్తున్న నానోతో పోల్చుకుంటే ఇది మరింత మెరుగ్గా ఉండనుంది. అయితే, ధర విషయంలోనే ఇది కొంచె ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఏదేమైన్పటికీ, కొత్త మోడల్ నానో విడుదలైన తర్వాత పాత మోడల్ నానో స్టాక్‌ను క్లియర్ చేసునేందుకు గాను కంపెనీ ఈ బుజ్జి కారుపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసిన ఆశ్చర్యం లేదు. మరి నానో కారును కొనేముందు ఒక్కసారి ఈ విషయాలు ఆలోచించండి..!

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2013, 10:44 [IST]
English summary
On exchanging any two wheeler Tata will offer a discount of Rs 15,000 on a new Nano, while exchanging a four wheeler will get you a discount of Rs 40,000. The latter is subjected to conditions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+