విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్: అత్యంత శక్తివంతమై టాటా విస్టా
ఈ ఫోటోలో కనిపిస్తున్న టాటా విస్టాని చూశారా..! ఇది టాటా విస్టాలన్నింటికి బాబు లాంటిది. అంటే, అంత తెలివైనది అలాగే శక్తివంతమైనదని అర్థం. దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ పవర్‌ఫుల్ 'విస్టా డి90' హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాటా విస్టా హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ అభివృద్ధి చేసిన 'విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్' కాన్సెప్ట్ క్రాసోవర్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది.
సాధారణ విస్టాతో పోల్చుకుంటే విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్‌లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. గతుకుల రోడ్లకు సైతం సరిపోయేలా ఎత్తు పెంచిన సస్పెన్షన్ (25 మి.మీ. వరకూ పెంచారు), బ్లాక్ కలర్ ఫ్రండ్ అండ్ రియర్ బంపర్స్, మెటాలియక్ యల్లో కలర్ బాడీ పెయింట్, బ్లాక్ కలర్ రియర్ డోర్ (బూట్ డోర్), వెనుకవైపు అమర్చిన స్పేర్ వీల్, 8-స్పోక్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, బ్లాక్ అండ్ బీజ్ కాంబినేషన్ ఇంటీరియర్స్, టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి అనేక ఫీచర్లను ఈ టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్‌లో గమనించవచ్చు.
ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది, ఈ కారుకు వెనుక భాగంలో అమర్చిన స్పేర్ వీల్‌ను సాధారణ ఎస్‌యూవీల మాదిరిగా నేరుగా వెనుక డోర్‌పై కాకుండా, టెయిల్ గేట్‌కు క్రింది భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సపోర్టింగ్‌పై ఈ వీల్‌ను అమర్చారు. వెనుక డోర్‌పై బరువు ఎక్కువ కాకుండా, డోర్ సులువుగా తెరుచుకునేందుకు ఈ విధమైన ఏర్పాటు చేశారు. ఈ స్పేర్ వీల్ కారు మొత్తం పొడవులో లెక్కలోకి రాదు కాబట్టి ఇది ఇప్పటికీ, నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది (సాధారణ విస్టా పొడవు). ఫలితంగా ఇది ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు అనువుగా ఉంటుంది.
టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్‌లో 1.3 లీటర్ వేరియబల్ జియోమెట్రీ టర్బో-ఎక్విప్డ్ క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని శక్తిని (పవర్) 104 బిహెచ్‌పిలకు పెంచారు. ప్రస్తుతం టాటా విడుదల చేసిన శక్తివంతమై విస్టా డి90 పవర్ కన్నా (89 బిహెచ్‌పి లేదా 90 పిఎస్) ఇది అధికమైనది. అంటే, టాటా విస్టా కార్లలో కెల్లా టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్టే అత్యంత శక్తివంతమైన కారు. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. అయితే, ఇందులో ప్రొడక్షన్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. ఇద దీని ధర విషయానికి వస్తే, విస్టా డి90 ధర కన్నా రూ.80,000 అధికంగా ఉండొచ్చని అంచనా.

టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్

టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్

టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్

టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్

టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్

టాటా విస్టా డి90 ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్



Click it and Unblock the Notifications








