అప్‌గ్రేడ్ అయిన తెలుగు డ్రైవ్‌‌స్పార్క్ ఆటోమొబైల్ వెబ్‌సైట్‌

మా విలువైన వన్ఇండియా పాఠకులకు తెలియజేయడమేమనగా.. మీరు ఇంతకాలం ఎంతగానో ఆదిరిస్తూ వచ్చిన మా ఆటోమొబైల్ విభాగం "తెలుగు డ్రైవ్‌స్పార్క్" విజయవంతంగా ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, తెలుగు డ్రైవ్‌స్పార్క్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మేము మా వెబ్‌సైట్‌ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దటం జరిగింది. సరికొత్త లుక్ అండ్ ఫీల్, ఆకర్షనీయమైన డిజైన్, సులువుగా అర్థం చేసుకునే సెక్షన్స్, మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో మా ఈ వెబ్‌సైట్‌ను మరింత కొత్తగా మెరుగపరచాము.

మా మాతృ వెబ్‌సైట్ (Drivespark.com) భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంగ్లంతో పాటు ఐదు ప్రాంతీయ భాషలలో ఆటోమొబైల్ రంగం యొక్క వార్తా విశేషాలను అందిస్తున్న ఏకైక వెబ్‌సైట్. మా ఈ 'డ్రైవ్‌స్పార్క్' వెబ్‌సైట్ ప్రత్యేకించి కేవలం ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలోనే కాకుండా, ప్రపంచం నలుమూలల జరిగే ఆటోమొబైల్ వింతలు విశేషాల గురించి సంపూర్ణమైన, విలువైన మరియు విశ్లేషణాత్మకమైన కథనాలను ఐదు ప్రాంతీయ భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మళయాలం) ప్రచురిస్తుంది.

కొత్త వాహనాల విడుదలకు సంబంధించిన సమాచారం, వాహనాల ఫీచర్లు మరియు ధరలు, టెస్ట్ డ్రైవ్ సమీక్షలు, ఆటోమొబైల్ చిట్కాలు, ఆటోవిడిభాగాలకు సంబంధించిన సమాచారం, ఆకర్షనీయమైన కార్లు, బైకుల చిత్రాలు మరియు వీడియోలు, సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు మరియు కొనుగోళ్లు కొత్త కార్లు మరియు బైక్‌ల శోధించాలనుకునే వారి కోసం రీసెర్చ్ టూల్స్ మరియు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఈ డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మా విలువైన పాఠకులకు అందించే ఒక చిన్ని ప్రయత్నమే మా ఈ "తెలుగు డ్రైవ్‌స్పార్క్ డాట్ కామ్". గడచిన ఏడాది కాలంగా మా వెబ్‌సైట్‌ను అభివృద్ధిలోకి తీసుకువచ్చిన మా విలువైన పాఠకులకు ఈ సందర్భంగా మా హార్థిక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

మా పాఠకులకు ప్రపంచస్థాయి విలువలను అందించేందుకు గానూ ఈ మార్పులను చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మా "తెలుగు వన్ఇండియా"ను ఆదరిస్తున్నట్లుగానే మా ఈ "తెలుగు డ్రైవ్ స్పార్క్" వెబ్‌సైట్‌ను కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ గురించి మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ను మాతో పంచుకోగలరు.

మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ..

మీ ఎడిటర్

Telugu DiveSpark

More from DriveSpark

Article Published On: Saturday, January 12, 2013, 19:16 [IST]
English summary
Telugu.drivespark.com (Automobile wing of http://telugu.oneindia.com/) is front runner in providing automobile news in Telugu. We take this opportunity to confirm that http://telugu.drivespark.com/ has received a facelift on the occasion of completing one successful year. We urge you to check out the refreshed look and please feel free to provide us your feedback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+