XUV500 టెస్ట్ డ్రైవ్ చేయండి, దక్షిణాఫ్రికా ట్రిప్‌ను గెలుచుకోండి
మీరు ఎస్‌యూవీ ప్రియులా..? ఉచితంగా దక్షిణాఫ్రికా ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే వెంటనే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా కంపెనీ ఓ ప్రత్యేక క్యాంపైన్‌ను ప్రారంభించింది.
'అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేయండి, దక్షిణాఫ్రికా ట్రిప్‌ను గెలుచుకోండి' అంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ట్రిప్‌కు అయ్యే ఖర్చులను పూర్తిగా కంపెనీయే భరిస్తుందట. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం మీ సమీపంలోని అధీకృత మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్‌ను సంప్రదించాల్సిందే.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ విషయానికి వస్తే, పవర్‌ఫుల్ ఎమ్‌హాక్ ఇంజన్, 6-స్పీడ్ ట్రాన్సిమిషన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, జిపిఎస్‌తో కూడిన 6 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయెల్ ఏసి, లెథర్ సీటింగ్, టైర్-ట్రానిక్స్, హిల్ హోల్డ్ అండ్ డిసెంట్ కంట్రోల్, స్టాటిక్ బెండింగ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, మైక్రోహైబ్రిడ్ టెక్నాలజీ వంటి విశిష్టమైన ఫీచర్లు దీని సొంతం.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 కొనుగోలుదారుల కోసం కంపెనీ 100 శాతం వరకు రుణం, అతి తక్కువ ఈఎమ్ఐ, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ వంటి సదుపాయాలను కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫర్ చేస్తుంది.



Click it and Unblock the Notifications








