2013 ఇండియన్ గ్రాండ్ ప్రి టికెట్ సేల్స్ ఓపెన్

By Ravi

ఫార్ములా వన్ రేస్ ప్రియులారా త్వరపడండి. ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరగనున్న 3వ సిరీస్ 2013 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో డాట్‌కామ్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బుధ్ ఇంటర్నెషనల్ సర్క్యూట్ (బిఐసి) ఫార్ములా వన్ కార్లు మరోసారి రయ్ రయ్‌మని దూసుకుపోనున్నాయి.

'ఇండియన్ ఫార్ములా గ్రాండ్ ప్రి'గా పిలిచే ఈ ఎఫ్1 రేస్ అక్టోబర్ 25, 2013 నుంచి 27, 2013 వరకు జరుగుతుంది. వీక్షకులు కావాలనుకుంటే, మూడు రోజుల ఈవెంట్‌కు సీజన్ టికెట్‌ను లేదా కేవలం రేస్ రోజుకు రేస్ డే టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు రూ.1,500ల నుంచి రూ.21,000 మధ్యలో ఉన్నాయి. సీజన్ టికెట్ (3-రోజులు) గ్రాండ్‌స్టాండ్ (రేస్ ట్రాక్‌కు అతి సమీపంలో) ధర రూ. 21,000లుగా ఉండగా, రేస్ రోజు గ్రాండ్‌స్టాండ్ టికెట్ ధర రూ. 12,000లుగా ఉంది.

తక్కువ ధరలో కూడా గ్రాండ్ ప్రిను లైవ్‌లో వీక్షించాలనుకునే వారి కోసం న్యాచురల్ స్టాండ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 1-2, 8-9 మలుపుల వద్ద ఉంటాయి. మూడు రోజులకు గాను న్యాచురల్ స్టాండ్ టికెట్ రూ.1,000లుగా ఉండగా, రేస్ రోజు టికెట్ ధర రూ.1,500లుగా ఉన్నాయి. ఈ ఫార్ములా వన్ రేస్ కోసం అందుబాటులో ఉన్న వివిధ స్టాండ్‌లు, వాటి టికెట్ల ధరల వివరాలను క్రింది ఫొటోలో గమనించవచ్చు.

The 2013 Indian Grand Prix Tickets Are on Sale

More from DriveSpark

Article Published On: Saturday, August 3, 2013, 15:15 [IST]
English summary
The tickets for the third edition of the 2013 Indian Grand Prix are now one sale, the organisers have announced. The Indian GP organizers have opened the ticket sales for the upcoming Indian Formula Grand prix, which is scheduled on October 25 - 27.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+