ప్రపంచంలో కెల్లా నష్టాలు తెచ్చిపెట్టే టాప్ 10 కార్లు
కార్ల తయారీదారులు అందించే ఉత్పత్తుల్లో కొన్ని సదరు తయారీదారులకు లాభాలనే తెచ్చిపెడితే, మరికొన్ని నష్టాలను మిగిల్చి పెడుతాయి. మనదేశంలో నష్టాలు తెచ్చిపెట్టే కార్లంటే టక్కున టాటా నానో, దేవూ మాటిజ్ లేదా మహీంద్రా వెరిటో వంటి పేర్లు గుర్తొస్తాయి. మిస్‌ప్లేస్డ్ పొజిషన్, పూర్ మార్కెటింగ్ వలన నానో అమ్మకాలు సజావుగా సాగటం లేదు, వెరిటో కూడా డిజైన్ లోపం వంటి వివిధ కారణాల వల్ల సక్సెస్ సాధించ లేకపోయింది. ఇక మాటిజ్ అయితే, ప్రస్తుతం దేశంలోనే లేకుండా పోయింది.
సరే, ఇండియా విషయం పక్కన పెట్టి, ప్రపంచ వ్యాప్తంగా కార్ మేకర్లకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్న మోడళ్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ఆటోమోటివ్ పరిశోధన సంస్థ బెర్స్టీన్ రీసెర్చ్ ప్రపంచం వ్యాప్తంగా కోట్ల డాలర్లలో నష్టాలను తెచ్చిపెట్టే టాప్ 10 కార్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలో కెల్లా అత్యంత చిన్న కార్లలో ఒకటైన కారు కూడా ఉండటం గమనార్హం. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

స్మార్ట్ ఫర్ టూ
* మొత్తం నష్టం, 1997 నుంచి 2006 వరకు: 2.82 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 1997 నుంచి 2006 వరకు: 3,762 యూరోలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ స్మార్ట్ ఫర్ టూ అనే సిటీ కారును అభివృద్ధి చేసింది. ఇందు కోసం కంపెనీ 3 బిలియన్ యూరోలను పెట్టుబడిగా వెచ్చించింది. లో కాస్ట్ కారు కోసం ఇంత మొత్తాన్ని వెచ్చించడం వలన కంపెనీకు నష్టాలే మిగిలాయి.

ఫియట్ స్టాలియో
* మొత్తం నష్టం, 2001 నుంచి 2009 వరకు: 1.77 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2001 నుంచి 2009 వరకు: 2,297 యూరోలు

ఫోక్స్‌వ్యాగన్ ఫేటన్
* మొత్తం నష్టం, 2001 వరకు: 1.68 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2001 వరకు: 23,655 యూరోలు

ప్యూజో 1007
* మొత్తం నష్టం, 2004 నుంచి 2009 వరకు: 1.59 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2004 నుంచి 2009 వరకు: 12,947 యూరోలు

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్
* మొత్తం నష్టం, 1997 నుంచి 2004 వరకు: 1.44 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 1997 నుంచి 2004 వరకు: 1,214 యూరోలు

బుగాటి వేరాన్
* మొత్తం నష్టం, 2005 నుంచి 2013 వరకు: 1.43 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2005 నుంచి 2013 వరకు: 38,87,051 యూరోలు
ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ బుగాటి, తమ వేరాన్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ధరకే ఈ కారును విక్రయిస్తుంది. ఈ మోడల్‌ను ప్రాఫిట్ మేకింగ్ కారుగా కాకుండా ఫోక్స్‌వ్యాగన్ సాంకేతిక సామర్థ్యాన్ని తెలియజేసే కారుగా చూపించాలనేదే కంపెనీ లక్ష్యం. అందుకే, ఈ మోడల్‌పై భారీ నష్టాలు వస్తున్నా కంపెనీ నవ్వుతూ వాటిని భరిస్తుంది.

జాగ్వార్ ఎక్స్-టైప్
* మొత్తం నష్టం, 2001 నుంచి 2009 వరకు: 1.43 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2001 నుంచి 2009 వరకు: 3,945 యూరోలు

రెనో లగునా
* మొత్తం నష్టం, 2006 నుంచి 2012 వరకు: 1.30 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2006 నుంచి 2012 వరకు: 2,986 యూరోలు

ఆడి ఏ2
* మొత్తం నష్టం, 2000 నుంచి 2005 వరకు: 1.2 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2000 నుంచి 2005 వరకు: 6,340 యూరోలు

రెనో వెల్ సాటిస్
* మొత్తం నష్టం, 2001 నుంచి 2009 వరకు: 1 బిలియన్ యూరోలు
* ప్రతి యూనిట్‌పై నష్టం, 2001 నుంచి 2009 వరకు: 15,751 యూరోలు


Click it and Unblock the Notifications








