ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'టొయోటా' మరోసారి ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన ఆటోమొబైల్ బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్జ్ టాప్ 100 మోస్ట్ వ్యాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాలో గడచిన సంవత్సరం అగ్రగామిగా ఉన్న జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూని ఈ ఏడాది టొయోటా ఓవర్‌టేక్ చేసింది. ప్రముక మార్కెట్ రీసెర్చ్ సంస్థ మిల్‌వార్డ్ బ్రౌన్ నిర్వహించిన వార్షిక అధ్యయనంలో అన్ని రంగాలకు చెందిన అత్యంత విలువైన 100 బ్రాండ్‌ల జాబితాను వెల్లడి చేసింది.
ఈ జాబితాలో టొయోటా 2006 నుంచి 2009 వరకూ అగ్రస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత 2010 మరియు 2012లో బిఎమ్‌డబ్ల్యూ ఈ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఈ ఏడాది టొయోటా విలువ 12 శాతం వృద్ధి చెంది 24.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో టొయోటా ర్యాంకింగ్ 23. టొయోటా తర్వాతి స్థానంలో (24వ ర్యాంక్)లో బిఎమ్‌డబ్ల్యూ ఉంది. ఈ ఏడాది బిఎమ్‌డబ్ల్యూ విలువ కేవలం 2 మాత్రమే వృద్ధి చెంది 24 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇకపోతే 3వ స్థానంలో మెర్సిడెస్ బెంజ్ (43వ ర్యాంక్) 11 శాతం వృద్ధిని సాధించి 18 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. జర్మన్ బిగ్ త్రీలో 3వ బ్రాండ్ అయిన ఆడి మాత్రం 8వ స్థానం (టాప్ 100 ర్యాంక్‌లలో లేదు)తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఆడి విలువ 5.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ప్రముఖ ఐటి సంస్థ యాపిల్ 185.1 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మరి ఈ జాబితాలో మన టాప్ 100 ఆటో బ్రాండ్‌లపై ఓ కన్నేద్దాం రండి..!

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
టొయోటా
24,497 మిలియన్ డాలర్లు
12 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
బిఎమ్‌డబ్ల్యూ
24,015 మిలియన్ డాలర్లు
2 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
మెర్సిడెస్ బెంజ్
17,952 మిలియన్ డాలర్లు
11 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
హోండా
12,401 మిలియన్ డాలర్లు
-2 శాతం క్షీణత

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
నిస్సాన్
10,186 మిలియన్ డాలర్లు
3 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
ఫోక్స్‌వ్యాగన్
8,790 మిలియన్ డారల్రు
3 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
ఫోర్డ్
7,556 మిలియన్ డాలర్లు
8 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
ఆడి
5,545 మిలియన్ డాలర్లు
18 శాతం వృద్ది

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
హ్యుందాయ్
4,000 మిలియన్ డాలర్లు
11 శాతం వృద్ధి

ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన టాప్ 10 ఆటో బ్రాండ్స్
లెక్సస్
3,472 మిలియన్ డాలర్లు
2 శాతం వృద్ధి

Click it and Unblock the Notifications