చిన్న పిల్లల కోసం రియల్ కారులా కనిపించే బొమ్మ కారు
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారు పేరు 'టొయోటా కమాట్టే57ఎస్' కాన్సెప్ట్ (Toyota Camatte57s Concept). జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా గడచిన సంవత్సరం టోక్యోలో జరిగిన టోక్యో మోటార్స్ షోలో ఈ కారును ఆవిష్కరించింది. ఇది మాముల కార్ల మాదిరిగా పెట్రోల్ ఇంజన్ కలిగిన రియల్ కారు కాదు. రియల్ కారులా కనిపించే బొమ్మ కారు. ఈ కారును పిల్లల కోసం కంపెనీ అభివృద్ధి చేసింది.
టొయోటా కమాట్టే57ఎస్ బొమ్మ కారు అయినప్పటికీ దీనిని నడిపే అవకాశం ఉంటుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ఈ కారును నడపవచ్చు. ఈ కారు పేరుకు తగినట్లుగానే ఇందులో ఊడదీయటానికి వీలుగా ఉండే (డీఅటాచబల్) 57 బాడీ ప్యానెల్స్‌ను ఉపయోగించారు. ముక్కులగా ఉండే పజిల్‌ను జతచేసినట్లుగా ఈ విడిభాగాలను కారుకు మనమే జోడించుకోవచ్చు.
ఈ బాడీ ప్యానెల్స్ వెరైటీ రంగులలో లభిస్తాయి. వీటి సాయంతో కారును మనకు నచ్చిన రంగులో మార్చుకోవచ్చు. ఈ కారును ప్రత్యేకించి పిల్లల కోసం రూపొందించారు. వారిలో ఆటోమొబైల్ పట్ల, డ్రైవింగ్ పట్ల చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో దీనిని తయారు చేశారు. ఇందులో మూడు సీట్లు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముందు సీట్లో కూర్చోబెట్టి వారు వెనుక సీట్లలో కూర్చొనే స్టీరింగ్, బ్రేక్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. అయితే, ఈ కారును పబ్లిక్ రోడ్లపై నడిపేందుకు అనుమతి లేదు. మరి ఈ పిల్లల కారుపై మనం కూడా ఓ కన్నేద్దామా?












Click it and Unblock the Notifications