5-స్పీడ్ ఆటోమేటిక్ ఫార్చ్యూనర్‌ను విడుదల చేసిన టొయోటా

By Ravi

దేశీయ విపణిలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) అందిస్తున్న పవర్‌ఫుల్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. టొయోటా ఫార్చ్యూనర్ ఇప్పటి వరకూ 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తోనే లభ్యమవుతుండగా, ఇందులో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన కొత్త వేరియంట్‌ను టికెఎమ్ విడుదల చేసింది. భారత మార్కెట్లో ఆ కొత్త వేరియంట్ ధర రూ.22.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, ఈ వేరియంట్‌ను రెగ్యులర్ గ్రేడ్‌‌లో ప్రవేశపెడుతున్నామని కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 24, 2009లో భారత మార్కెట్లో విడుదలైన టొయోటా ఫార్చ్యూనర్ ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా నిలిచి, ఇప్పటి వరకూ 41,000 లకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఏరోడైనమిక్స్‌ను టిఆర్‌డి (టొయోటా రేసింగ్ డెవలప్‌మెంట్) డిజైన్ చేసింది.

Toyota Fortuner TRD Sportivo

స్పోర్టీ లుక్ ఫార్చ్యూనర్ కోసం కంపెనీ తొలుత ఈ వేరియంట్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రవేశపెట్టింది. అయితే, ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దీనిని రెగ్యులర్ వేరియంట్‌గా మార్చడం జరిగింది. టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు:
  • కొత్త డిజైన్ కలిగిన ఫ్రంట్ బంపర్, స్పాయిలర్
  • కొత్త డిజైన్ కలిగిన రియర్ రూఫ్ స్పాయిలర్
  • కొత్త డిజైన్ కలిగిన రియర్ బంపర్
  • స్టయిలిష్‌గా డిజైన్ చేయబడిన టిఆర్‌డి స్పోర్టివ్ లోగో

ఇది మూడు ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ కలర్స్ (సూపర్ వైట్ ప్లస్ గ్రే, సిల్వర్ ప్లస్ గ్రే, వైట్ పెరల్ మైకా ప్లస్ గ్రే) రంగులలో లభ్యమవుతుంది. అలాగే అన్ని వేరియంట్లలో పెరల్ వైట్ మైకా అనే కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేయటం జరిగింది. టొయోటా ఫార్చ్యూనర్‌లో కొత్తగా విడుదల చేసిన వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* టొయోటా ఫార్చ్యూనర్ 4x2 ఆటోమేటిక్ (5-స్పీడ్) - రూ.22.33 లక్షలు
* టొయోటా ఫార్చ్యూనర్ 4x2 ఆటోమేటిక్ టిఆర్‌డి స్పోర్టివో (5-స్పీడ్) - రూ.22.93 లక్షలు
* టొయోటా ఫార్చ్యూనర్ 4x2 మ్యాన్యువల్ టిఆర్‌డి స్పోర్టివో - రూ.22.93 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, January 17, 2013, 8:00 [IST]
English summary
Toyota Kirloskar Motor (TKM) has launched a new variant in its flagship SUV Fortuner, with a five speed Automatic Transmission. The new transmission provides enhanced drive feel and comfort. Looking at the overwhelming demand and popularity of the Fortuner TRD Sportivo, the Limited Edition has now been introduced as a regular grade.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+