ఊసరవెల్లిలా రంగులు మార్చే టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్

By Ravi

గడచిన సంవత్సరం టోక్యో మోటార్ షోలో జపనీస్ కార్ కంపెనీ టొయోటా మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన 'ఫన్-విఐఐ' (Fun Vii) కాన్సెప్ట్ కారు గుర్తుందా? భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును అభివృద్ధి చేయటం జరిగింది. వెహికల్, ఇంటారాక్టివ్, ఇంటర్నెట్ (విఐఐ) అనే అర్థం వచ్చేలా టొయోటా ఈ పేరును ప్రతిపాదించింది. ఈ కారు బాడీ ఎల్‌సిడి టచ్ స్క్రీన్ మాదిరిగా పనిచేస్తుంది. ఈ మొత్తం డోర్ కూడా, ఓ చట్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ పనిచేసినట్లుగానే పనిచేస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది చక్రాపై కదిలే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కారు ఆకారంలో ఉండే పర్సనల్ కంప్యూటర్ అనొచ్చు. ఈ కారు ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చేసుకుంటుంది. చిత్ర విచిత్రమైన వాల్‌పేపర్లతో కారు బాడీ ప్యానెల్‌ను మనకు నచ్చినట్లుగా మార్చేసుకోవచ్చు. అనేక రకాల మొబైల్ అప్లికేషన్లు ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఈ కారు ప్రొజెక్టర్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, మనం ఏదో కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది.

టొయోటా ఫన్-విఐఐ లోపలి ఆకర్షనీయమైన డిజైన్ ఓ అద్భుతాన్ని తలపిస్తుంది. ఇల్యూషన్ టెక్నాలజీతో కూడిన ఈ కారులో కూర్చుని ఎలాంటి గ్యాడ్జెట్స్ (స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి) లేకుండానే ఇంటర్నెట్ సాయంతో స్నేహితులతో కనెక్ట్ కావచ్చు. కారులో లోపలి భాగాలు కూడా తెరల (స్క్రీన్స్) మాదిరిగా పనిచేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, రోబో, ఐరన్ మ్యాన్ వంటి సినిమాల్లో చూపించే సాంకేతిక పరిజ్ఞానం ఈ కారులో కనిపిస్తుంది. గడచిన సంవత్సరం జరిగిన టోక్యో మోటార్ షోలో టొయోటా ఈ కాన్సెప్ట్ కారు తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది.

ఈ ఏడాది జరగనున్న కొన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ ప్రదర్శనలలో కూడా ఇది కనిపించే అవకాశం ఉంది. ఇదొక త్రీ-సీటర్ (ముగ్గురికి మాత్రమే చోటు ఉంటుంది) ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రయాణ అవసరాల కోసం దీన్ని రూపొందించారు. దీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 105 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఈ కారును వాణిజ్యం పరంగా ఉత్పత్తి చేసే విషయాన్ని కంపెనీ స్పష్టం చేయలేదు. టెక్నాలజీలో తాము ఎంత ముందున్నామో నిరూపించుకునేందుకే ఈ కారును డిజైన్ చేశామని, ఇది "నాలుగు చక్రాలపై నడిచే స్మార్ట్ ఫోన్" (స్మార్ట్ ఫోన్ ఆన్ ఫోర్ వీల్స్) లాంటిదని టొయోటా మోటార్ కో పేర్కొంది.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

మనకు నచ్చిన వాల్ పేపర్‌ను కారు బాడీ గ్రాఫిక్స్‌‌గా మార్చుకోవచ్చు.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

ఈ కారుకు బాడీ ప్యానెల్స్ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్‌లో పనిచేస్తాయి. ఇందులో అనేక మొబైల్ ఫోన్ అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

మనం ఉండే లొకేషన్‌కు అనుగుణంగా కారు గ్రాఫిక్స్‌ను మార్చుకోవచ్చు.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

ఈ కారును స్మార్ట్ ఫోన్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

ఇదొక త్రీ సీటర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు. ఇందులో ముగ్గురికి మాత్రమే చోటు ఉంటుంది.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

వెహికల్, ఇంటారాక్టివ్, ఇంటర్నెట్ (విఐఐ) అనే అర్థం వచ్చేలా టొయోటా ఈ కారుకు ఫన్-విఐఐ అనే పేరును పెట్టడం జరిగింది.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

ఈ కారులో ఇంటర్నెట్ సాయంతో ఎప్పుడైనా, ఎక్కడైనా ఎల్లప్పుడూ మీ స్నేహితులతో కనెక్ట్ అయి ఉండొచ్చు.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

కారు లోపలి విండ్ స్క్రీన్ కూడా సమాచారాన్ని అందించే విజువల్ స్క్రీన్‌గా పనిచేస్తుంది.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

వైర్‌లెస్ ఛార్జింగ్:

ఈ కారులోని బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవటానికి ఎలాంటి వైర్లు అవసరం లేదు. ఈ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయవచ్చు.

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్ కార్

More from DriveSpark

Article Published On: Thursday, February 7, 2013, 11:02 [IST]
English summary
Japanese auto major Toyota Motor Co has unveiled its futuristic concept car "Fun-Vii" at 2012 Tokyo Motor Show. Toyota says its a smart phone on four wheels. The Fun-Vii is three-seater electric car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+