టొయోటా ఇన్నోవా క్రోమ్ ఎడిషన్ ప్యాకేజ్ విడుదల
ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎమ్‌పివి సెగ్మెంట్లో ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ టొయోటా ఇన్నోవాకు మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. గడచిన కొద్ది సంవత్సరాలు ఎమ్‌పివి సెగ్మెంట్లో రారాజు వెలుగొందుతున్న ఇన్నోవా ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా కొనుగోలుదారులకు చేరువ అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్నోవా ఎమ్‌పివిలో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.
టొయోటా ఇన్నోవా క్రోమ్ ఎడిషన్‌గా లభ్యం కానున్న ఈ కొత్త వేరియంట్ పేరుకు తగినట్లుగా క్రోమ్ ఫినిష్‌తో ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ క్రోమ్ ఎడిషన్ ప్యాకేజ్‌ను మీ పాత ఇన్నోవాకు కూడా జోడించుకొని కొత్తదానిలా మార్చేసుకోవచ్చు. ఈ క్రోమ్ ఎడిషన్ ప్యాకేజ్ వెల రూ.31,000. టొయోటా కిర్లోస్కర్ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాల వద్ద ఇది అందుబాటులో ఉంటుంది. ఈ క్రోమ్ ఎడిషన్ ప్యాకేజ్‌లో లభించే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

- క్రోమ్ వీల్ ఆర్చ్ మౌల్డింగ్
- రియర్ డోర్ క్రోమ్ లిడ్ గార్నిష్
- క్రోమ్ డోర్ హ్యాండిల్
- క్రోమ్ ఇన్‌సెర్ట్‌తో కూడిన బంపర్ కార్నర్ ప్రొటెక్టర్
- సైడ్ టర్న్ ల్యాంప్ క్రోమ్ కవర్
- మఫ్లర్ (సైలెన్సర్) కట్టర్
- టర్న్ ఇండికేటర్లతో కూడిన అవుటర్ మిర్రర్ క్రోమ్ కవర్
- ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ గార్నిష్


Click it and Unblock the Notifications








