ఇండోనేషియాలో టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా అందిస్తున్న ఎమ్‌పివి 'ఇన్నోవా'లో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు, కంపెనీ సన్నహాలు చేస్తోందని, తొలుత ఇది ఇండోనేషియా మార్కెట్లో విడుదల కానుందని, ఈనెల 16న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం కొత్త 2013 టొయోటా ఇన్నోవా ఇండోనేషియా మార్కెట్లో విడుదలయ్యింది.

ఇండోనేషియా మార్కెట్లో ఇన్నోవా ఎమ్‌పివిని 'కిజాంగ్' (Kijang) పేరుతో విక్రయిస్తున్నారు. త్వరలోనే ఈ అప్‌గ్రేడెడ్ ఇన్నోవా భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. గడచిన సంవత్సరం జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టొయోటా ఓ ఫేస్‌లిఫ్ట్ ఇన్నోవాను విడుదల చేసిన విషయం తెలిసినదే. అదేవిధంగా, వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఇన్నోవాను ప్రదర్శించే ఆస్కారం ఉంది. అంతకన్నా ముందే భారత్‌లో విడుదలైనా ఆశ్చర్య పోవాల్సిన అసరం లేదు.


ఫేస్‌లిఫ్ట్ టొయోటా ఇన్నోవా ఎమ్‌పివిలో కొత్తేంటి..?
ప్రస్తుత ఇన్నోవాతో పోల్చుకుంటే కొత్త ఇన్నవా ఫ్రంట్ డిజైన్ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ముందు వైపు పెద్ద క్రోమ్ గ్రిల్, సరికొత్త ఫ్రంట్ బంపర్, కొత్త సన్నటి ఎయిర్‌డ్యామ్ డిజైన్, ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్స్ వంటి మార్పులు అప్‌గ్రేడెడ్ ఇన్నోవాలో చూడొచ్చు. వెనుక వైపు కూడా క్రోమ్ గార్నిష్ చేశారు. నెంబర్ ప్లేట్‌కు పైభాగంలో పెద్ద క్రోమ్ బార్‌ను జోడించారు.

కొత్త ఇన్నోవా ఓవరాల్ షేప్ మాత్రం యధావిధిగా ఉంటుంది. ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్ టొయోటా ఇన్నోవా టాప్ ఎండ్ వేరియంట్లో కొత్త సౌండ్ సిస్టమ్‌ను జోడించారు. ఇండోనేషియన్ వెర్షన్ కిజాంగ్‍‌లోని అన్ని వేరియంట్లలో ట్విన్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడి, ఏబిఎస్ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. హార్డ్‌వేర్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయలేదు.

Toyota Kijang MPV

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2013, 15:04 [IST]
English summary
Here is what's new in Toyota Innova facelift. The front end is entirely different. The front grille, with plenty of chrome, is large and broad and also replaces the lower air dam (now a narrower, but stylish bumper) from the previous model. The fog lamp housing features a new design as well, along with chrome surrounds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+