లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఎతియోస్, లివా విడుదల
టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎతియోస్ సెడాన్, లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో 'లిమిటెడ్ ఎడిషన్' వేరియంట్లను విడుదల చేసింది. రెగ్యులర్ వెర్షన్ టొయోటా ఎతియోస్, లివా మోడళ్లతో పోల్చుకుంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్, లివా మోడళ్లలో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టామని, కొనుగోలుదారులకు ఇవి కొత్త ఎక్స్‌క్లూజివ్ అనుభూతిని కల్పిస్తాయని టికెఎమ్ ఎమ్‌డి, సీఈఓ సందీప్ సింగ్ తెలిపారు.
లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్, లివా మోడళ్ల ఉత్పత్తిని కేవలం 2000 యూనిట్లకు (రెండు మోడళ్లు కలిపి) మాత్రమే పరిమితం చేశారు. ఎతియోస్, లివా కార్లలోని మిడ్-రేంజ్ వేరియంట్ (G)ను ఆధారంగా చేసుకొని ఈ లిమిటెడ్ ఎడిషన్లను తయారు చేశారు. ఈ మోడళ్లలో యాంత్రికపరమైన మార్పులు లేవు. రెగ్యులర్ వెర్షన్ జి వేరియంట్ ఎతియోస్, లివా కార్లు సింగిల్ కలర్ ఇంటీరియర్‌తో లభ్యమవుతుంటే, లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు మాత్రం డ్యూయెల్ టోన్ కలర్ (క్రీమ్ అండ్ బీజ్) ఆప్షన్‌తో లభ్యం కానున్నాయి.

అన్ని లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్, లివా కార్ల వెనుకవైపు 'ఎక్స్‌క్లూజివ్' అనే బ్యాడ్జ్ (వేరియంట్ పేరుకు దిగువన) ఉంటుంది. ఇంకా ఇందులో రిమోట్‌తో కూడిన బ్లూటూత్ ఆడియో సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, మెరుగైన సీట్ ఫ్యాబ్రిక్, క్రోమ్ క్యాప్‌తో కూడిన గేర్ షిఫ్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు లభ్యం కానున్నాయి. దేశీయ విపణిలో లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్, లివా కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- లిమిటెడ్ ఎడిషన్ లివా (పెట్రోల్) - రూ.4.95 లక్షలు
- లిమిటెడ్ ఎడిషన్ లివా (డీజిల్) - రూ.6.05 లక్షలు
- లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్ (పెట్రోల్) - రూ.6.05 లక్షలు
- లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్ (డీజిల్) - రూ.7.13 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








