మాన్‌సూన్ ఫ్రీ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించిన టొయోటా
వర్షాకాలం ప్రారంభం కావటంతో తమ కస్టమర్లకు నాణ్యమైన సర్వీసింగ్ సేవలు అందించేందుకు తయారీదారులు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కస్టమర్ల కోసం ‘ఇట్స్ రెయినింగ్ మానుసూన్ ఆఫర్స్ విత్ క్యూ క్లాస్ సర్వీస్' (Q Service Ke Saath Monsoon Offers Ki Barsaat) అనే వర్షాకాలపు (మాన్‌సూన్) క్యాంపైన్‌ను ప్రారంభించింది.
దక్షిణ భారతదేశంలోని అన్ని టొయోటా అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ క్యాంపైన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా, టయోటా తమ వాహనాల సర్వీసింగ్‌కు సంబంధించి వివిధ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ ‘ఇట్స్ రెయినింగ్ మానుసూన్ ఆఫర్స్ విత్ క్యూ క్లాస్ సర్వీస్' ఈ నెల 31 వరకూ అందుబాటులో ఉంటుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సందీప్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ క్యాంపైన్‌లో భాగంగా, టయోటా డీలర్‌షిప్ కేంద్రాలకు తీసుకువచ్చే టయోటా వాహనాలకు ఉచిత 20 పాయింట్స్ వెహికల్ చెకప్ నిర్వహిస్తామని, అంతేకాకుండా, సర్వీస్ పార్టులలో ఆకర్షనీయమైన ఆఫర్లు, తగ్గింపులను అందిస్తామని కంపెనీ తెలిపింది. వర్షాకాలంలో టొయోటా వాహన వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీ ప్రయాణించాలనే లక్ష్యంతో ఈ క్యాంపైన్‌ను ప్రారంభించామని సందీప్ సింగ్ వివరించారు.



Click it and Unblock the Notifications








