కరోలా ఆల్టిస్‌లో కొత్త వేరియంట్లను విడుదల చేసిన టొయోటా

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ అందిస్తున్న సి-సెగ్మెంట్ సెడాన్ 'కరోలా ఆల్టిస్'లో రెండు సరికొత్త వేరియంట్లను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. కరోలా ఆల్టిస్ జే (ఎస్) పెట్రోల్, కరోలా ఆల్టిస్ జే (ఎస్) డీజిల్ వేరియంట్లను టొయోటా ప్రవేశపెట్టింది భారత విపణిలో వీటి ధరలు ఇలా ఉన్నాయి. కాగా.. టొయోటా అందిస్తున్న బేస్ పెట్రోల్ వేరియంట్ కరోలా ఆల్టిస్ (జే) విక్రయాలను కంపెనీ నిలిపివేసింది.

  • టొయోటా కరోలా ఆల్టిస్ జే (ఎస్) పెట్రోల్ - రూ.11.74 లక్షలు
  • టొయోటా కరోలా ఆల్టిస్ జే (ఎస్) డీజిల్ - రూ.13.16 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన కరోలా ఆల్టిస్ జే (ఎస్) డీజిల్ వేరియంట్ బేస్ డీజిల్ వేరియంట్ (జే) మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో కొత్తగా ఎయిర్‌బ్యాగ్స్, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లు అదనంగా లభిస్తాయి. అలాగే కరోలా ఆల్టిస్ జే బేస్ పెట్రోల్ వేరియంట్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ప్రవేశపెట్టిన కరోలా ఆల్టిస్ జే (ఎస్)లో అదనంగా రెండు ఎయిర్‌బ్యాగ్స్, మ్యాన్యువల్ ఏసి విత్ హీటర్, రియర్ ఆర్మ్‌రెస్ట్, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Corolla Altis

ఈ కొత్త వేరియంట్లలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. పెట్రోల్ వేరియంట్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 205 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్‌లో ఉపయోగించిన 1.8 లీటర్ ఇంజన్ గరిష్టంగా 139.9 పిఎస్‌ల శక్తిని, 173 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 15.23 కి.మీ. మైలేజీని మరియు డీజిల్ వేరియంట్ లీటరుకు 21.45 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 3, 2013, 15:41 [IST]
English summary
Toyota Kirloskar Motors has silently launched the two new variants of its Corolla Altis sedan. The new variants are J (S) petrol and the J (S) diesel and have been priced at Rs 11.74 lakh (ex-showroom Delhi) and Rs 13.16 lakh (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+