టొయోటా మెగా మాన్‌సూన్ ఆఫర్; లివా, ఎతియోస్‌లపై డిస్కౌంట్స్

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టొయోటా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ లివా, సెడాన్ ఎతియోస్‌లపై కంపెనీ రూ.25,000 విలువైన ప్రోత్సాహకాలను అందిస్తుంది. గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను, వివిధ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, టొయోటా కూడా తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన ఎతియోస్, లివా కార్లపై కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.

మెగా మాన్‌సూన్ ఆఫర్ పేరుతో కంపెనీ ఈ రెండు మోడళ్లపై రూ.25,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ కార్లపై ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్‌ను కంపెనీ అందిస్తుంది. ఎతియోస్‌పై రూ.7,888 ఈఎమ్ఐ, లివాపై రూ.6,444 ఈఎమ్ఐ‌ను కంపెనీ ప్రకటించింది. ఇవే కాకుండా, ఆకర్షనీయమైన ఎక్సేంజ్ ఆఫర్స్, లాయల్టీ బోనస్, యాక్ససరీ ప్యాకేజ్, కార్పోరేట్లు, టీచర్లు మరియు డాక్టర్లకు స్పెషల్ ఆఫర్లను కూడా టొయోటా అందిస్తోంది.

ఇంకా, టొయోటా ఎతియోస్ లేదా లివా కార్లను టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి కాంప్లిమెంటరీగా బుక్ మై షో డాట్‌కా నుంచి మూవీ వోచర్లను కూడా కంపెనీ అందిస్తోంది. ఎతియోస్ సెడాన్ ప్రారంభ ధర రూ.5.45 లక్షలుగా ఉండగా, లివా ప్రారంభ ధర రూ.4.46 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ రెండు మోడళ్లు 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ. వారంటీ (ఏది ముందు మగిస్తే అది) మరియు 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో లభిస్తాయి. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అధీకృత టొయోటా డీలరును సంప్రదించండి.

Toyota Mega Monsoon Offer

More from DriveSpark

Article Published On: Saturday, June 8, 2013, 18:26 [IST]
English summary
Toyota has started Mega Monsoon Offer for their customers. Now Etios & Liva buyers can experience benefits of up to Rs.25,000. Visit your nearest Toyota dealer for more information.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+