ప్రపంచ వ్యాప్తంగా 3.69 లక్షల వాహనాలను రీకాల్ చేసిన టొయోటా
జపనీస్ కార్ కంపెనీ టొయోటా మోటార్ కార్పోరేషన్‌ను కార్లను రీకాల్ చేయటం కొత్తేమీ కాదు. తాజాగా, టొయోటా ప్రపంచ వ్యాప్తంగా 3,69,000 వాహనాలను రీకాల్ చేసింది. ఇందులో 2,00,000 వాహనాలను హైబ్రిడ్ సిస్టమ్ సమస్య కారణంగా రీకాల్ చేయగా, 1,69,000 వాహనాలను బోల్ట్ సమస్య కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింజి.
గ్లోబల్ మార్కెట్లలో టొయోటా విక్రయిస్తున్న లెక్సస్ ఆర్400, హైల్యాండర్ మోడళ్లలోని హైబ్రిడ్ సిస్టమ్స్ మరియు జపాన్‌లో విక్రయిస్తున్న హ్యారీర్, క్లుగర్ హైబ్రిడ్ కార్లలో ఇన్వర్టర్ సమస్య కారణంగా అమెరికాలో 1,41,000 వాహనాలను, జపాన్‌వో 15,000 వాహనాలను రీకాల్ చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇన్వర్టర్ సమస్య వల్ల రీకాల్ చేయటం టొయోటాకు ఇది మొదటిసారి.
ఈ లోపం వలన అలారమ్ ఆఫ్ అయిపోయి, హైబ్రిడ్ పనిచేయటం ఆగిపోతుందని టొయోటా తెలిపింది. ఇక రెండవ సందర్భానికి వస్తే, లెక్సస్ జిఎస్350, ఐఎస్350, క్రౌ మరియు మార్క్ ఎక్స్ మోడళ్లలో బోల్ట్ సమస్య కారణంగా అమెరికాలో 1,06,000 వాహనాలను, జపాన్‌లో 59,000 వాహనాలను రీకాల్ చేశారు. ఈ బోల్ట్ లూజ్ అవుతున్న కారణంగా ఇంజన్ ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ పేర్కొంది.



Click it and Unblock the Notifications








