ఇప్పట్లో లెక్సస్‌ను భారత్‌కు తీసుకురావట్లేదు: టొయోటా

By Ravi

భారత రోడ్లపై లెక్సస్ కార్ల పరుగును చూడాలనుకున్న ఆటో ప్రియుల కల కలగానే మిగిలిపోనుంది. ప్రస్తుత మార్కెట్ మందగమన పరిస్థితులు కావచ్చు లేదా ఇప్పుడు సరైన సమయం కాకపోవచ్చ, ఏదేమైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన లెక్సస్ బ్రాండ్ మాత్రం ఈ సంవత్సరంలో ఇండియాలోకి రావట్లేదు. జపనీస్ కార్ మేకర్ టొయోటాకు చెందిన లగ్జరీ కార్ లెక్సస్‌ను 2013 నాటికి ఇండియాలో ప్రవేశపెట్టాలని అప్పట్లో కంపెనీ నిర్ణయించింది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను, ఆర్థిక అనిశ్చితలను గమనించిన టొయోటా తమ లెక్సస్ బ్రాండ్‌ను ఇప్పట్లో ఇండియాలో ప్రవేశపెట్టే యోచన లేదని తేల్చి చెప్పేసింది.

ఈ విషయం గురించి టొయోటా ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ ప్రస్తావిస్తూ.. సమీప భవిష్యత్తులో లెక్సస్ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టే ఆలోచన లేదని చెప్పారు. ఇందుకు అనేక ప్రతికూల కారణాలున్నాయని ఆయన అన్నారు. గడచిన బడ్జెట్‌లో భారత సర్కారు దిగుమతి సుంఖాలను భారీగా పెంచిన నేపథ్యంలో, విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడి మార్కెట్‌లోకి దిగుమతి చేసుకొని విక్రయించడం అంత సులువు కాదని అన్నారు. బలహీన పడుతున్న రూపాయి విలువ కూడా ఇందుకు గల కారణాల్లో ఒకటని సందీప్ సింగ్ చెప్పారు.

లెక్సస్ ఎల్ఎక్స్

లెక్సస్ ఎల్ఎక్స్

లెక్సస్ ఎల్ఎఫ్-ఏ రోడ్‌స్టర్ కాన్సెప్ట్

లెక్సస్ ఎల్ఎఫ్-ఏ రోడ్‌స్టర్ కాన్సెప్ట్

లెక్సస్ జిఎస్ 450హెచ్

లెక్సస్ జిఎస్ 450హెచ్

లెక్సస్ ఆర్ఎక్స్ 350

లెక్సస్ ఆర్ఎక్స్ 350

లెక్సస్ ఎల్ఎస్ సెలూన్

లెక్సస్ ఎల్ఎస్ సెలూన్

లెక్సస్ ఎల్ఎఫ్ ఏ కాన్సెప్ట్

లెక్సస్ ఎల్ఎఫ్ ఏ కాన్సెప్ట్

ఎఫ్ స్పోర్ట్ లెక్సస్ ఐఎస్-సి

ఎఫ్ స్పోర్ట్ లెక్సస్ ఐఎస్-సి


భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి లగ్జరీ కార్ కంపెనీలు గట్టి సవాలును విసిరేందుకు టొయోటా తమ కార్ బ్రాండ్ లెక్సస్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని భావించింది. గతంలో లెక్సస్ బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావటంపై టొయోటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి నగాకవా మాట్లాడుతూ.. భారత్‌లో విస్తరణ కోసం కొత్త ప్రణాళికలను కంపెనీ పరిశీలిస్తోందని, ఇందులో భాగంగాగనే.. లెక్సస్ కారును భారత్‌కు తీసుకు వచ్చే అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి గమనిస్తుంటే, లెక్సస్ కార్లు ఇప్పట్లో ఇండియన్ రోడ్లపై పరుగులు పెట్టే అవకాశాలు అస్సలు కనబడటం లేదు.

More from DriveSpark

Article Published On: Saturday, January 5, 2013, 17:13 [IST]
English summary
Japanese auto gaint Toyota Motor Co has dropped its plans to bring their luxury car brnad Lexus in Indian by 2013. Toyota Kirloskar Motors Deputy Managing Director Sandeep Singh has confirmed that the luxury brand will not be making a debut anytime soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+