ఫేస్‌బుక్‌లో క్యామ్రీ హైబ్రిడ్ టీజర్‌ను విడుదల చేసిన టొయోటా

By Ravi

హైబ్రిడ్ కార్ల తయారీలో ప్రపంచ అగ్రగామి కంపెనీ అయిన, జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా ఈ ఆగస్ట్ నెలలో భారత మార్కెట్లో తమ సరికొత్త క్యామ్రీ హైబ్రిడ్ కారును విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా, క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్‌కు సంబంధించిన ఓ టీజర్ ఫొటోను కంపెనీ తమ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేసింది.

టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. ఈ హైబ్రిడ్ కారులో ఒక 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఒక 640 వోల్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ పెట్రోల్ ఇంజన్ ఈ-సివిటి (ఎలక్ట్రానికి కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 146 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 187 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, ఇది 140 పిఎస్‌ల గరష్ట శక్తిని, 270 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 189 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు మోటార్ల సాయంతో అధిక మైలేజీని సాధించవచ్చని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు ధర రూ.35-36 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

రెగ్యులర్ వెర్షన్ టొయోటా క్యామ్రీ సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో ఈ హైబ్రిడ్ వెర్షన్‌ను తయారు చేశారు. మరికొద్ది రోజుల్లోనే క్యామ్రీ హైబ్రిడ్ భారత మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టొయోటా నుంచి ప్రియస్ హైబ్రిడ్ కారు మాత్రమే లభ్యమవుతోంది. ఇది రెగ్యులర్ వెర్షన్ క్యామ్రీ సెడాన్‌కు ఎగువన ఉండనుంది. రెగ్యులర్ వెర్షన్‌కు, హైబ్రిడ్ క్యామ్రీకి మధ్య వ్యత్యాసాన్ని తెలిపేందుకు గాను, ఇందులో కొన్ని మార్పులు, చేర్పులు ఉండనున్నాయి.

Toyota Camry

ఈ మార్పులలో ప్రధానంగా, ఎక్స్టీరియర్స్‌లో విభిన్నమైన బంపర్, క్రోమ్ గ్రిల్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్, క్రోమ్ ఇన్‌సెర్ట్‌తో కూడిన రీస్టయిల్డ్ ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను హైబ్రిడ్ క్యామ్రీలో చూడొచ్చు. ఇది హైబ్రిడ్ కారు అని తెలిపేందుకు గాను వెనుక వైపు 'హైబ్రిడ్ సైనర్జీ డ్రైవ్' అనే బ్లూ బ్యాడ్జ్ ఉంటుంది.

అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, త్రీ డయల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్ వంటి ప్రధాన మార్పులను మనం గమనించవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2013, 12:39 [IST]
English summary
Toyota India has updated it's Facobook cover page with hybrid Camry. This time Toyota is considering to launch Hybrid Camry in India. Toyota Kirloskar Motors is now all set to launch the Camry hybrid in India by end of this month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+