సెప్టెంబర్ 21 నుంచి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

By Ravi

ప్రస్తుత పండుగ సీజన్ టొయోటా కార్లను కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ఈనెల 21వ తేదీ నుంచి తమ కార్ల ధరలను రూ.24,000 మేర పెంచనున్నట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, తగ్గుతున్న రుపాయి విలువ కారణంగానే ధరలు పెంచాల్సి వస్తుందోని, వివిధ మోడళ్లపై ఈ పెంపు 1.5 శాతం ఉంటుందని కంపెనీ తెలిపింది.

దీంతో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి టొయోటా ఎతియోస్, ఎతియోస్ లివా, ఇన్నోవా, కరొలా ఆల్టిస్ కార్ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.9.77 లక్షల నుంచి రూ.14.42 లక్షల రేంజ్‌లో ఉన్న ఇన్నోవా ఎమ్‌పివి ధరలు రూ.7,000 నుంచి రూ.11,000 వరకు, రూ.11.74 లక్షల నుంచి రూ.15.89 లక్షల రేంజ్‌లో ఉన్న కరోలా ఆల్టిస్ సెడాన్ ధరలు రూ.11,000 నుంచి రూ.24,000 వరకు పెరగనున్నాయి.

అలాగే, రూ.5.45 లక్షల నుంచి రూ.8.15 లక్షల రేంజ్‌లో ఉన్న ఎతియోస్ సెడాన్ ధరలు రూ.4,000 నుంచి రూ.8,000 వరకు మరియు రూ.4.46 లక్షల నుంచి రూ.6.59 లక్షల రేంజ్‌లో ఉన్న ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4,500 నుంచి రూ.8,600 వరకు పెరుగుతాయని కంపెనీ వివరించింది. పండుగ సీజన్ నేపథ్యంలో కార్లపై తగ్గింపులు ఆఫర్ చేయాల్సిందిపోయి, కార్లను ధరలను పెంచడం గమనార్హం. అసలే మందకొడిగా సాగుతున్న ఆటోమొబైల్ పరిశ్రమపై తాజా ధరల పెంపు మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపే అస్కారం ఉంది.

Toyota Innova

More from DriveSpark

Article Published On: Wednesday, September 18, 2013, 10:08 [IST]
English summary
Toyota Kirloskar Motor said it will hike prices of its key models by up to Rs 24,000 with effect from September 21, to partly offset higher cost of raw materials and rupee depreciation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+