ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 2014 టొయోటా కరోలా ఆవిష్కరణ

By Ravi

ఈ కారును గుర్తు పట్టారా..? జపనీస్ కార్ కంపెనీ టొయోటా ఈ ఏడాది మధ్య భాగంలో ఆవిష్కరించిన సరికొత్త 2014 కరోలా సెడాన్ ఇది. ఈ స్టన్నింగ్, స్టయిలిష్ కార్ మరికొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఈ సరికొత్త 2014 టొయెటా కరోలా సెడాన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

బెంగుళూరులోని బిడది ప్లాంటులో టొయోటా ఈ కొత్త కరోలా సెడాన్‌ను ఉత్పత్తి చేయనుంది. కాగా.. కంపెనీ ఆవిష్కరించిన అమెరికన్, యూరోపియన్ వెర్షన్ కరోలా సెడాన్లు ఇప్పటికే ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. అమెరికన్ వెర్షన్ కరోలాను మిసిసిపిలో ఉన్న బ్లూ స్ప్రింగ్ ప్లాంట్‌లో గడచిన ఆగస్ట్ నెలలో ఉత్పత్తి ప్రారంభించగా, యూరోపియన్ వెర్షన్‌ను టర్కీలోని సకరయ ప్లాంటులో గడచిన జులై నెలలో ఉత్పత్తి ప్రారంభించారు. భారత్‌కు రానున్న కరోలా సెడాన్‌కు యూరోపియన్ వెర్షన్ కరోలా సెడాన్‌కు చాలా దగ్గర పోలికలు ఉంటాయి.


కొత్త 2014 టొయోటా కరోలా సెడాన్‌లో ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ (88.4 పిఎస్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్)ను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్ డ్యూయెల్ విటివిటి-ఐ (140 పిఎస్ పవర్, 173 ఎన్ఎమ్ టార్క్) ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్లను 6-స్పీడ్ మ్యన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో అనుసంధానం చేయబడి ఉంటాయి. టొయోటా ఇప్పటికే తమ బిడది ప్లాంట్ సమీపంలో కొత్త కరోలా సెడాన్‌ను టెస్టింగ్ చేస్తోంది. సికెడి రూట్లో థాయ్‌లాండ్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని, ఈ కారును అసెంబ్లింగ్ చేయనున్నారు.
2014 Toyota Corolla

More from DriveSpark

Article Published On: Tuesday, November 12, 2013, 10:31 [IST]
English summary
According to the reports, the Japanese carmaker Toyota will showcase the 2014 Corolla sedan at 2014 Auto Expo in Noida next February. This will only be an initial unveiling as the Bidadi plant will only start the production of the 2014 Toyota Corolla quite some time later.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+