లివా ఇంటీరియర్లను బీజ్ కలర్‌తో అప్‌గ్రేడ్ చేసిన టొయోటా
టొయోటా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఎతియోస్ లివా ఇంటీరియర్లను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. కొద్ది నెలలో క్రితం ఎతియోస్ సెడాన్ ఇంటీరియర్స్‌ను అప్‌గ్రేడ్ చేసిన మాదిరిగానే ఇప్పుడు లివా హ్యాచ్‌బ్యాక్‌లో కూడా బీజ్ కలర్ ఇంటీరయర్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశీయ విపణిలో టొయోటా ఎతియోస్, లివా మోడళ్ల అమ్మకాలు ఆశించిన రీతిలో ఉండకపోవటంతో కంపెనీ ఈ మోడళ్లను తరచూ అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. గతంలో ఈ మోడళ్ల ఇంటీరియర్లు టొయోటా స్టాండర్డ్స్ ప్రకారం లేకపోయిన కారణంగా కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆనాసక్తి చూపేవారు.
తాజాగా ఎతియోస్ లివాలో చేర్చిన బీజ్ ఇంటీరియర్స్ వల్లనైనా ఈ మోడల్ అమ్మకాలు పెరుగుతాయో లేదా వేచి చూడాల్సి ఉంది. మరో వైపు ఈ రెండు మోడళ్లకు మరింత ప్రాచుర్యం కల్పించేలా టొయోటా వీటిలో సరికొత్త వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత సంవత్సరంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయబడిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్, ఎతియోస్ సెడాన్ మోడళ్లు మార్కెట్లోకి రావచ్చని అంచనా.



Click it and Unblock the Notifications








