ఎతియోస్, లివా కార్లపై టొయోటా వీకెండ్ ధమాకా ఆఫర్
గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో కార్ల కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు వివిధ ప్రోత్సాహకాలను, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుండగా, తాజాగా జపనీస్ కార్ కంపెనీ టొయోటా ఇండియా తమ కొత్త ఎతియోస్, లివా కార్లపై వివిధ ఆఫర్లను అదిస్తోంది.
'వీకెండ్ ధమాకా' పేరుతో టొయోటా వచ్చే వారంతంలో (ఏప్రిల్ 20, 21వ తేదీలలో) ఎతియోస్, లివా కార్లపై వివిధ ఆఫర్లను అందిస్తోంది. ఈ రెండు రోజుల్లో టొయెటా ఎతియోస్ సెడాన్, టొయోటా ఎతియోస్ లివా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు తక్కువ ఈఎమ్ఐ ఆఫర్, ఎక్సేంజ్ బోనస్ ఆఫర్, లాయల్టీ/కార్పోరేట్/గవర్నమెంట్ బోనస్‌లను అందిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ డిస్కౌంట్లు, స్కీమ్‌లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో టొయోటా అధీకృత డీలర్‌ను సంప్రదించండి. వీకెండ్ ధమాకా ఆఫర్ మరియు డిస్కౌంట్లు ఏప్రిల్ 20, 21వ తేదీలలో ఎతియోస్, లివా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.



Click it and Unblock the Notifications








