మారుతి సుజుకి నుంచి రానున్న అప్‌గ్రేడెడ్ వ్యాగన్ఆర్

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే డిజైన్ పరంగా మరింత మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దిన సరికొత్త అప్‌డేటెడ్ వ్యాగన్‌ఆర్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి బ్రాండ్ కోసం తయారు చేసిన ఓ టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో తమ కొత్త వ్యాగన్ఆర్‌ను కంపెనీ ఉపయోగించింది.

భారతీయ పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మారుతి సుజుకి రూపొందించిన 1 నిమిషం నిడివి గల ఈ టివి కమర్షియల్‌లో సరికొత్త వ్యాగన్ఆర్ కారును గమనించవచ్చు. ప్రస్తుత వ్యాగన్ఆర్ కారుతో పోల్చుకుంటే ఈ కొత్త వ్యాగన్ఆర్ కారు ఫ్రంట్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులను గమనించవచ్చు. కొత్త వ్యాగన్ఆర్ ఫ్రంట్ గ్రిల్ పాత వెర్షన్ కన్నా చిన్నదిగా ఉంటుంది. అంతేకుండా పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్, సరికొత్త ఫాగ్‌ల్యాంప్ డిజైన్ వంటి మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్స్‌లో కూడా చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

అయితే, కొత్త వ్యాగన్ఆర్‌లో ఎలాంటి యాంత్రిక పరమైన మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుత వ్యాగన్ఆర్ కారులో ఉపయోగించిన 998సీసీ ఇంజన్‌నే కొత్త వ్యాగన్ఆర్‌లో ఉపయోగించనున్నారు. ఇది కూడా పెట్రోల్, సిఎన్‌జి, ఎల్‌పిజి వెర్షన్లలో లభ్యం కానుంది. అతి త్వరలోనే ఈ కొత్త వ్యాగన్ఆర్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపుగా కొత్త వ్యాగన్ఆర్ ఫోటోలు, వీడియోలను అలాగే ప్రస్తుత వ్యాగన్ఆర్ ఫోటోలను తిలకించండి.

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్: వీడియో

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ప్రస్తుత మారుతి సుజుకి వ్యాగన్ఆర్

More from DriveSpark

Article Published On: Friday, January 4, 2013, 11:55 [IST]
English summary
Maruti Suzuki is all set to launch a new look Wagon R in some time. Although there has been no official confirmation from Maruti Suzuki of the 2013 Wagon R, the carmaker has inadvertently revealed the car in a TV commercial. Maruti Suzuki has started telecasting a one minute TV commercial titled 'Festival called life' featuring some of its best selling cars. The advertisement shows several families celebrating festivals from across India. One shot has a white Wagon R which definitely has a new front design.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+