మీ ప్రస్తుత ఫిగోను సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగోగా మార్చుకోండి

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా ఇటీవలే ఓ సరికొత్త సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, మీరు ఇప్పటికే ఫోర్డ్ ఫిగోను కొనుగోలు చేసి ఉండి, సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగోను సొంతం చేసుకోలేకపోయామని చింతిస్తున్నారా..? అయితే, ఇక మీ చింత దూరమైనట్లే. ఎందుకంటే, ప్రస్తుత ఫోర్డ్ ఫిగోలను సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగోలుగా మార్చుకోవచ్చని కంపెనీ తమ ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజ్‌లో పేర్కొంది.

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో కారులో లభిస్తున్న అన్ని అదనపు ఫీచర్లను తమ ప్రస్తుత ఫిగో కార్లలోను అమర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోర్డ్ పిగో హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఫోర్డ్ ఇండియా గడచిన నెలలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, లిమిటెడ్ ఎడిషన్ సీట్ కవర్స్, ఫిగో బ్రాండెడ్ స్కఫ్ ప్లేట్స్, పార్కింగ్ సెన్సార్స్, రియర్ రూఫ్ స్పాయిలర్ వంటి ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ అందిస్తోంది.

ఇప్పుడు ఫోర్డ్ ఫిగో వినియోగదారులు పైన తెలిపిన అన్ని అదనపు ఫీచర్లను తమ కారుకు కూడా జోడించుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ సమీపంలోని ఫోర్డ్ అధీకృత డీలరును సంప్రదించి, అదనపు ఫీచర్లకు అయ్యే మొత్తాన్ని చెల్లించడమే. అప్పుడు మీ సాధారణ ఫోర్డ్ ఫిగో కూడా సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగోగా మారిపోతుంది. ప్రస్తుతం ఫోర్డ్ అందిస్తున్న సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో లభించే ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జింగ్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

రియర్ రూఫ్ స్పాయిలర్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

పార్కింగ్ సెన్సార్స్/రివర్స్ పార్కింగ్ అసిస్ట్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

ఫిగో బ్రాండెడ్ స్కఫ్ ప్లేట్స్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగో

లిమిటెడ్ ఎడిషన్ సీట్ కవర్స్

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2013, 16:36 [IST]
English summary
Ford India has launched the celebration edition Figo to celebrate the 3rd anniversary of the car in India. Would you like to upgrade your current Figo to the Celebration Edition Figo? Visit your nearest Ford dealer to buy the Add-ons and upgrade your car!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+