మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఫేస్‌లిఫ్ట్ టాటా నానో

2013 Tata Nano
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'లో మరో సరికొత్త వెర్షన్ త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నానోకు మరిన్ని అధనపు ఫీచర్లను జోడించి, డిజైన్ పరంగా స్వల్పంగా మార్పులు చేయబడిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ టాటా నానోను కంపెనీ ఈనెలలో మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

గడచిన కొద్ది నెలలుగా టాటా నానో అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. కంపెనీ ఇటీవలే గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న తమ టాటా నానో ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా 80 శాతం మేర తగ్గించింది. దీనికి తోడు అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటులో కేవలం నానో కార్లను తప్ప వేరే కార్లను ఉత్పత్తి చేసే సౌకర్యం లేదు.

ఈ నేపథ్యంలో, ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా గుర్తింపు తెచ్చుకున్న తమ నానో కారును నిలిపివేయటానికి బదులు ఈ కారులో వినియోగదారులు కోరుకున్నట్లుగా మార్పు చేర్పులు చేయటం మంచిదని కంపెనీ భావించింది. గడచిన సంవత్సరం కూడా టాటా నానోలో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్ (2012 వేరియంట్)ను సరికొత్త హంగులతో, రీట్యూన్ చేయబడిన ఇంజన్‌తో ధరలో ఎలాంటి మార్పు లేకుండా కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసినదే.

కాగా.. కొత్తగా రానున్న టాటా నానో ఇంజన్‌లో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్స్ పరంగా ప్రధానమైన మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మోడల్ ధర కూడా కాస్తంత అధికంగానే ఉండొచ్చని అంచనా. డీజిల్ వెర్షన్ టాటా నానో, సిఎన్‌జి వెర్షన్ టాటా నానోల విడుదలకు సంబంధించి కూడా త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. 2013 టాటా నానోకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 1, 2013, 20:15 [IST]
English summary
The new 2013 Tata Nano is ready to be launched this month. 2013 Nano will be seen with minor tweaks and is expected to be offered in a petrol version as of now.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+