హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాలు

దీనికితోడు ఇప్పుడు హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ పుణ్యమా అని రోడ్లు కాస్త మరింత ఇరుకుగా మారిపోయాయి. నగరంలోని రోడ్లపై ప్రయాణమంటేనే భయమేసే పరిస్థితి నెలకొంది. అనేక మంది సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకోవటం కారణంగా కార్ల వంటి వాహనాల వినియోగం పెరుగుతోంది. ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు అయితే లెక్కే లేదు. ఇవన్నీ కలిసి రోడ్లెక్కుతుండటంతో రోడ్లపై కనుచూపు మేర ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి.
ఇలాంటి రద్దీ పరిస్థితుల్లో వాహనం నడపాలంటే ఎంతో మెళకువ కావాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మితి మీరిన వేగంతో వాహనాలు నడిపితే ఆ తర్వాత భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనో లేక రోడ్డుపై వెళ్లే ఇతర వాహన చాలకుల తప్పిదాల కారణంగా నగరంలో ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇందుకు ప్రత్యక నిదర్శనమే ఈ చిత్రం. అతివేగంతో వచ్చిన ఏపిఎస్ఆర్టీసీ బస్సు ఎలా డివైడర్‌పైకి ఎక్కి కూర్చుందో చూడండి.
అదృష్ట వశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ఒకవేళ ఎవరైనా ఏపిఎస్ఆర్టీసి డ్రైవర్ ర్యాష్ డ్రైవ్ చేస్తున్నట్లు మీకు కనిపిస్తే, బస్సు రిజిస్ట్రేషన్ నెంబరును నోట్ చేసుకొని 1800 200 4599 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి కంప్లయింట్‌ను రిజిస్టర్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








