మహీంద్రా వెరిటో వైబ్‌ను కస్టమర్లు కొనడం లేదా?

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వెల్లువెత్తున్న అవకాశాలను చేజిక్కుంచుకునేందుకు వెరిటో సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగిన ఓ కాంపాక్ట్ వెర్షన్ (వెరిటో వైబ్)ను మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసినదే.

గడచిన జూన్ 5వ తేదీన మహీంద్రా వెరిటో వైబ్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ కారు అమ్మకాల పరంగా కంపెనీ తలరాతను మారుస్తుందని మహీంద్రా భావించింది. అయితే, ఈ మోడల్ ఆశించిన రీతిలో అమ్ముడుపోవటం లేదని తెలుస్తోంది. జూన్ 2012తో పోల్చుకుంటే, జూన్ 2013లో మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు (యుటిలిటీ వాహనాలు, వెరిటో బ్రాండ్ కార్లు) 13 శాతం తగ్గి 19,792 యూనిట్ల నుంచి 17,232 యూనిట్లకు పడిపోయాయి.

అలాగే, జులై 2012తో పోల్చుకుంటే, జులై 2013లో మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు (యుటిలిటీ వాహనాలు, వెరిటో బ్రాండ్ కార్లు) 29 శాతం తగ్గి 22,011 యూనిట్ల నుంచి 15,530 యూనిట్లకు పడిపోయాయి. ఇందులో వెరిటో అమ్మకాల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. మొత్తమ్మీద చూసుకుంటే, కొత్త వెరిటో సెడాన్, లేటెస్ట్ వెరిటో వైబ్ కాంపాక్ట్ సెడాన్లు కంపెనీ అమ్మకాలపై పెద్ద ప్రభావాన్ని చూపడం లేదని తెలుస్తోంది.

Mahindra Verito Vibe

మహీంద్రా వెరిటో వైబ్
గడచిన జూన్ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా కేవలం రూ.5.6 లక్షల ప్రారంభ ధరకే కొత్త వెరిటో వైబ్‌ను విడుదల చేసింది. మొదటిసారిగా కారును కొనుగోలు చేసే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ కారును ప్రవేశపెట్టారు. ఇందులో ఉపయోగించిన రెనో కె9కె 1.5 లీటర్ సిడిఐ సిఆర్‌డిఐ, 4-సిలిండర్, 8-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 65 బిహెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల శక్తిని విడుదల చేస్తుంది.

వెరిటో వైబ్ లీటరు డీజిల్‌కు 20.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 3991 మి.మీ. పొడవును, 1740 మి.మీ. వెడల్పును, 1540 ఎత్తును కలిగి ఉండి, 172 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2630 మి.మీ. వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. దీని టర్నింగ్ రేడియస్ 5.25 మీటర్లు. ఈ కారు మొత్తం బరువు 1155 కేజీలు. ఈ కారులో వెనుక సీటు 1410 మి.మీ. వెడల్పును కలిగి ఉండి 3 హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంటుంది. అంటే ఈ సీటులో ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

Verito Vibe Hatchback

ఆకర్షనీయమైన కాంపాక్ట్ డిజైన్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 330 లీటర్స్ బూట్ స్పేస్, విశాలమైన ఇంటీరియర్స్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్ ఎయిర్‌‌బ్యాగ్ ఫీచర్లు వెరిటో వైబ్ సొంతం. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరెడార్ రెడ్, డాల్ఫిన్ గ్రే, డైమండ్ వైట్ మరియు ఆక్వా రష్ అనే ఏడు ఆకర్షనీయమైన రంగులతో, మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. మహీంద్రా వెరిటో వైబ్ 3 ఏళ్లు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 17, 2013, 10:04 [IST]
English summary
It seems Mahindra Verito Vibe compact sedan is not enough to boost company sales. In June and July 2013 Passenger Vehicles (UVs & Verito) sales were down by 13% and 29% respectively. With this figures, it is clear that Verito Vibe is not contributing enough to offset sales decline.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+