యువతే లక్ష్యంగా రూపొందించిన కొత్త టాటా నానో టివిసి

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ సరికొత్త 2013 టాటా నానో కారును మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రధానంగా నేటి ఆధునిక యువతను లక్ష్యంగా చేసుకొని టాటా ఈ కొత్త నానోను అప్‌గ్రేడ్ చేసింది. ద్విచక్ర వాహనాలకు ప్రత్యామ్నాయంగా, నలుగురు ప్రయాణికులు (స్నేహితులు) సౌకర్యవంతంగా ప్రయాణించేలా టాటా నానో కారును రూపొందించామని కంపెనీ హైలైట్ చేస్తోంది.

యువతను ఆకట్టుకునేందుకు గాను కొత్త నానో కోసం కంపెనీ ఓ వినూత్న టెలివిజన్ కమర్షిల్‌ (టివిసి)ను రూపొందించింది. 'సెలబ్రేట్ ఆసమ్‌నెస్ విత్ టాటా నానో' అనే థీమ్‌తో ఈ టెలివిజన్ కమర్షియల్ సాగిపోతుంది. ఇందులో ప్రధానంగా యువత కనిపిస్తుంది. ఈ వీడియోను యూట్యూబ్‍‌లో ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించారు. మీరు కూడా ఆ లేటెస్ట్ టివిసిను క్రింది వీడియోలో వీక్షించవచ్చు.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/Fj7kFvk-T7g?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
2013 టాటా నానో:
కొత్త నానో రాకతో ఈ మోడల్ అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. రాష్ట్ర మార్కెట్లో కొత్త నానో ప్రారంభ ధర రూ.1,63,000 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కొత్త నానో కారును అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన రెండు గ్లౌ బాక్సులు, 12 వోల్ట్ పవర్‌ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రియర్ పార్సిల్ షెల్ఫ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను జోడించారు.

అలాగే, కొత్త ఎక్స్టీరియర్ కలర్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ను జోడించారు. సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా స్టీరింగ్‌ను, సస్పెన్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్స్ (డాజల్ బ్లూ, రాయల్ గోల్డ్, కార్న్‌ఫ్లవర్ బ్లూ)ను జోడించారు. ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Tata Nano

రాష్ట్ర మార్కెట్లో కొత్త 2013 టాటా నానో వేరియంట్లు, ధరలు అలా ఉన్నాయి:
  • నానో స్టాండర్డ్ - రూ.1,63,000
  • నానో సిఎక్స్ - రూ.2,01,000
  • నానో ఎల్ఎక్స్ - రూ.2,28,000

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Saturday, August 10, 2013, 12:09 [IST]
English summary
Check out the new TVC of Tata Nano. Celebrate Awesomeness with the all new dazzling and vibrant Tata Nano. New Tata Nano, gets remote keyless entry, twin glove boxes, and a four-speaker AmphiStream™ music system with Bluetooth™, USB and auxiliary connectivity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+