హ్యుందాయ్ ఐ20 కొత్త టివి కమర్షియల్ చూశారా?

By Ravi

దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 కోసం కంపెనీ ఓ వినూత్న టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. ఈ ప్రకటను చూడాలంటే కాస్తం గుండె ధైర్యం కావాలి. ఈ ప్రకటన ప్రారంభంలో హ్యుందాయ్ ఈ విషయాన్ని పేర్కొంది. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియోని తిలకించండి, లేకపోతే తిలకించకండని కంపెనీ తమ ప్రకటనలో తెలిపింది.

హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‍‌‌బ్యాక్ కారులో ఉండే విశిష్టమైన ఫీచర్లను హైలైట్ చేయటమే ఈ ప్రకటన యొక్క ప్రధానా సారాంశం. అయితే, హ్యుందాయ్ ఇందుకు దెయ్యం థీమ్‌ను ఎంచుకుంది. ఈ టెలివిజన్ కమర్షియల్ కాస్తంత భయంకరంగాను, కాస్తంత సరదాగాను ఉంటుంది. బహుశా ఇది ఇంకా టెలివిజన్లలో విడుదల కాలేదేమో. మరి ఆ సరదా ప్రకటను మనం కూడా ఈ వీడియోలో చూద్దాం రండి..!


ఓ వ్యక్తి హ్యుందాయ్ ఐ20 కారులో స్మశానం మీదుగా వెళ్తుంటే, అక్కడ ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అతను కాస్తంత ముందుకు వెళ్లి వెనక్కు తిరిగి చూస్తే అక్కడ ఆ అమ్మాయి మాయమై నేరుగా కారులో ప్రత్యక్షవుతుంది. దీంతో తన కారులోకి వచ్చింది దెయ్యమని గుర్తించిన సదరు వ్యక్తి షాక్ గురై కంగారుగా డ్రైవ్ చేస్తుంటాడు.

అయితే, ఆటోమేటిక్‌గా హెడ్‌లైట్స్ ఆన్ కావటం, ఆన్ చేయకుండానే వైపర్లు ఆన్ అవటం మరియు వెనక్కు తిరిగి చూడకుండానే రివర్స్ పార్కింగ్ సెన్సార్ల సాయంతో రివర్స్ చేయటం చూసిన ఆ దెయ్యం ఈ ఫీచర్లను చూసి కారు నడిపే వ్యక్తి పెద్ద దెయ్యమని భావించి పారిపోతుంది. ఈ కారలో వర్షం పడటాన్ని గమనించి ఆటోమేటిక్‌గా పనిచేసే రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సూర్యకాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి. మరి మీకు నచ్చిందా ఈ వినూత్న టెలివిజన్ ప్రకటన.

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2013, 11:16 [IST]
English summary
Have you watched Hyundai i20's new TV Commercial Video. This TVC focuses on highlighting the best in class features available in hatchback like rain sensing wipers, automatic headlamps, reverse parking camera. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+