పోలో, వెంటో కార్ల ధరలు పెంచిన ఫోక్స్‌వ్యాగన్

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ దేశీయ విపణిలో అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్, వెంటో సెడాన్‌ల ధరలు పెరిగాయి. ఈ రెండు మోడళ్ల ధరలను 2.27 శాతం మేర పెంచుతున్నామని, పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ధరలు పెంచినప్పటికీ పోలో, వెంటో కార్లలోని కొన్ని వేరియంట్లలో అదనపు ఫీచర్లు జోడించి అందిస్తున్నామని కంపెనీ వివరించింగి.

ఈ పెంపు ఫోక్స్‌వ్యాగన్ పోలోపై దాదాపు రూ.10,000 నుంచి రూ.12,000 రేంజ్‌లోను, ఫోక్స్‌వ్యాగన్ వెంటోపై దాదాపు రూ.10,000 నుంచి రూ.20,000 రేంజ్‌లో ఉంటుంది. కంఫర్ట్‌లైన్, హైలైన్ వేరియంట్లలో యూఎస్‌బి, బ్లూటూత్, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, అలాగే వెంటో హైలైన్ వేరియంట్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను ఆఫర్ చేస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది.

ఇకపోతే పోలో హైలైన్ వేరియంట్‌లో యూఎస్‌బి, బ్లూటూత్, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన ఆర్‌సిడి 320 మ్యూజిక్ సిస్టమ్‌ను అలాగే పోలో కంఫర్ట్‌లైన్ వేరియంట్‌లో కేవలం యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన ఆర్‌సిడి 310 మ్యూజిక్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ వివరించింది. తక్షణం ధరల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ తాజా పెంపు అనంతరం పోలో హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.92 లక్షల నుంచి రూ.7.08 లక్షల మధ్యలో, వెంటో సెడాన్ ధరలు రూ.7.32 లక్షల నుంచి రూ.9.96 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 29, 2013, 10:12 [IST]
English summary
German carmaker Volkswagen Indid has increased the prices of its Polo hatchback and Vento sedan. The German carmaker has added more features to the Polo and the Vento in an effort to make its two cars more attractive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+