కాంపాక్ట్ వెంటో సెడాన్‌ను తీసుకురానున్న ఫోక్స్‌వ్యాగన్

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో అందిస్తున్న వెంటో సెడాన్‌ను ఆధారంగా చేసకొని, నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగిన ఓ కాంపాక్ట్ వెంటో సెడాన్‌ను మార్కెట్లో తీసుకురానున్నట్లు పేర్కొంది. నాలుగు మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న కార్లను పెద్ద కార్లుగా పరిగణించి వాటిపై అధిక మొత్తాలలో ఎక్సైజ్ సుంఖాలను వసూలు చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, చిన్న కార్లపై (నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగి ఉన్న కార్లు) అమల్లో ఉన్న ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు ఫోక్స్‌వ్యాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సబ్-ఫోర్-మీటర్ వెంటోను మార్కెట్లో ప్రవేశపెట్టడం గురించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ ఆర్ అండ్ డి ఛీఫ్ ఉల్రిచ్ హాకెన్‌బర్గ్ వెల్లడించారు. మారుతి సుజుకి ఇప్పటికే తమ కొత్త కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్‌ను విడుదల చేయటం ద్వారా ఈ సెగ్మెంట్లో ఎక్సైజ్ రాయితీలను పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, మార్కెట్లోకి రానున్న హోండా అమేజ్ (బ్రయో సెడాన్), మహీంద్రా కాంపాక్ట్ వెరిటోలు కూడా పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ ఉండి, ఎక్సైజ్ రాయితీలను పొందనున్నాయి.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. కొత్తగా తక్కువ ధర కలిగిన కాంపాక్ట్ వెరిటో సెడాన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ తమ అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ వెంటో సెడాన్ గురించి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Volkswagen Vento

More from DriveSpark

Article Published On: Friday, March 8, 2013, 14:03 [IST]
English summary
German carmaker Volkswagen is developing a sub four meter Vento for the Indian market. The new compact Vento will compete with Maruti Swift Dzire and the upcoming Honda Amaze and Mahindra compact Verito.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+