భారత్‌లో బీటెల్ కార్ సేల్స్‌ను నిలిపివేసిన ఫోక్స్‌వ్యాగన్
భారత మార్కెట్లో మరో కాంపాక్ట్ లగ్జరీ కారుకు శుభం కార్డ్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాధించుకున్న ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ (Volkswagen Beetle) (బీటెల్ అంటే ఓ రకమైన పేడ పురుగు అని అర్థం) కారుకు ఇండియాలో మాత్రం ఆశించిన స్పందన లభించలేదు. గడచిన 2009లో ఇది తొలిసారిగా భారత మార్కెట్లో విడుదలయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 500 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
దేశీయ విపణిలో ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు ఫెయిల్ కావటానికి ప్రధాన కారణం దీని అధిక ధరే (రూ. 20 లక్షలకు పైమాటే). అలాగే, ఈ కారును మార్కెటింగ్ చేయటంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవటం, మెయిన్ ప్లాంట్ నుంచి సరఫరా (దిగుమతి) నిలిచిపోవటం కూడా, బీటెల్ పరాజయానికి ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ బీటెల్ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించేంది. పెరిగిన దిగుమతి సుంకాల కారణంగా, ఈ కారు ధర కూడా పెరిగింది. మరో వైపు ఈ యూరోపియన్ డిజైన్ కారు ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే, కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయించడం నిలిపివేసింది.
ఫియట్ 500 కారు విషయంలో కూడా విధంగా జరిగింది. గ్లోబల్ మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన ఫియట్ 500 కారు ఇండియన్ మార్కెట్లో చతికిల పడింది. భారత్‌లో కేవలం 70 యూనిట్ల ఫియట్ 500 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీంతో ఫియట్ ఇండియా ఈ మోడల్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించింది. అయితే, ఇప్పట్లో కొత్త బీటెల్ కానీ కొత్త ఫియట్ 500 కానీ భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.



Click it and Unblock the Notifications








