త్వరలో పెరగనున్న ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్ల ధరలు

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా త్వరలోనే దేశీయ విపణిలో అందిస్తున్న ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు పేర్కొంది. బుధవారం జరిగిన సియామ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా సమావేశం అనంతరం సైడ్‌లైన్స్‌లో విలేఖరులతో మాట్లాడుతూ.. డాలరు మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ తమ మార్జిన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, ఈ పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని అన్నారు.

ప్రస్తుతం తాము ఎంత మేర ధరలను పెంచాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి గమనిస్తే, రూపాయి విలువ దాదాపు 25 శాతం క్షీణించింది. రూపాయి విలువ, అధిక దిగుమతి సంఖాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన అంశాలు ఆటోమొబైల్ కంపెనీలు పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఇండియా, భారత్‌లో తమ ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 1వ తేది నుంచి 2.5-4.5 శాతం మేర పెంచిన సంగతి తెలిసినదే.

Volkswagen India To Increase Car Prices

More from DriveSpark

Article Published On: Thursday, September 5, 2013, 11:46 [IST]
English summary
German carmaker Volkswagen India has announced it will raise prices of its products due to rupee depreciation. This information has been reveled by Volkswagen Passenger Cars managing director Arvind Saxena.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+