వెంటో జిటి టిఎస్ఐను విడుదల చేయనున్న ఫోక్స్‌వ్యాగన్

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, భారత మార్కెట్లో అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ జిటి వెర్షన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు కంపెనీ అందిస్తున్న సెడాన్ 'ఫోక్స్‌వ్యాగన్ వెంటో'లో కూడా జిటి వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

వెంటో జిటి సెడాన్ కూడా పోలో జిటి హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే తొలుత పెట్రోల్ వెర్షన్‍‌లో విడుదల కానుంది. పోలో జిటి టిఎస్ఐ హ్యాచ్‌బ్యాక్ కారులో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ ఏడాది ఆరంభంలో 1.6 లీటర్ పెట్రోల్ వెర్షన్ పోలో ఉత్పత్తిని నిలిపి వేసి పోలో జిటి టిఎస్ఐను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

Vento GT TSI

వెంటో సెడాన్ విషయంలో కూడా ఇదే జరగనుంది. ఇందులో కూడా 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను ఫోక్స్‌వ్యాగన్ తొలగించి, దాని స్థానంలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 17.84 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇంధన వినియోగం పరంగా మరింత సమర్థవంతమైన వెంటో సెడాన్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ కలిగిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ వెంటో జిటి టిఎస్ఐ సెడాన్ మంచి పెర్ఫామెన్స్‌ను, స్పోర్టీ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, వెంటో జిటి టిఎస్ఐలో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Sunday, September 29, 2013, 17:46 [IST]
English summary
After the launch of powerful Polo GT TSI and Polo GT TDI versions, Now the German carmaker Volkswagen India is all set to launch a TSI version of Polo's sedan sibling, Vento. Stay tune to drivespark.com for latest updates.
Read more on: #sedan #సెడాన్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+