ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్ల కోసం ఫుల్లీ లోడెడ్ ఆఫర్

By Ravi

జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్, వెంటో సెడాన్ల కోసం 'ఫుల్లీ లోడెడ్' ఆఫర్‌ను పరిచయం చేసింది.

ఈ కార్లను కొనాలనుకునే వారు ఇప్పుడు కారు ధరలో కేవలం 20 శాతాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని 36 నెలల్లో సులభ వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు.

పోలో ఈఎమ్ఐ రూ.9999గా ఉండగా, వెంటో ఈఎమ్ఐ రూ.14,699గా ఉంది. అంతేకాకుండా, సింగిల్ ఈఎమ్ఐలో కస్టమర్లు కార్ ఫైనాన్స్, వార్షిక మెయింటినెన్స్ కాంట్రాక్ట్, ఇన్సూరెన్స్‌తో కలిపి ఉచిత బెనిఫిట్లు, అధనపు వారంటీ, 3 ఏళ్ల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు.

పోలో, వెంటో కార్లు అధునాతన 2 డిన్ ఆర్‌సిడి 320 మ్యూజిక్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇది బ్లూటూత్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, ఎస్‌‌డి కార్డులను సపోర్ట్ చేస్తుంది.

ఈ ఆఫర్ జులై 8, 2013 నుంచి జులై 25, 2013 వరకు బుక్ చేసుకునే పోలో, వెంటో కార్లపై వర్తిస్తుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత ఫోక్స్‌వ్యాగన్ డీలరును సంప్రిదించండి.

Volkswagen Polo

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2013, 14:32 [IST]
English summary
Volkswagen, Europe’s leading car manufacturer today launched a “Fully Loaded” offer for its volume carlines – The Polo and Vento today. Every Volkswagen enthusiast can now own the Polo and the Vento immediately by paying 20% of the price and the remaining amount in a period of 36 months with an EMI of Rs. 9,999 for Polo and Rs. 14,699 for Vento.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+