సరికొత్త జెట్టా సెడాన్‍ను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమయం సెడాన్ జెట్టాలో ఓ సరికొత్త అపగ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2013 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్‌కు వాషర్స్‌తో కూడిన జెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, డ్యూయెల్-జోన్ క్లైమాట్రానిక్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ సిస్టమ్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి కొత్త ఫీచర్లను జోడించారు.
ఇంకా ఇందులో 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, క్రూయిజ్ కంట్రోల్ సాంకేతిక వ్యవస్థలను కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే, యాంత్రిక (ఇంజన్) పరంగా ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదివరకటి వెర్షన్‌లో ఉపయోగించిన 140 బిహెచ్‌పి 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్, 121 బిహెచ్‌పి 1.4 లీటర్ టిఎస్ఐ పెట్రల్ ఇంజన్లనే ఈ కొత్త జెట్టాలోను ఉపయోగించారు.

ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. అయితే, ఇందులో కేవలం డీజిల్ వెర్షన్ జెట్టా మాత్రమే 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది, దీనికి ప్యాడల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మ్యాన్యువల్ డీజిల్ వెర్షన్ జెట్టా లీటరుకు 19.33 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ డీజిల్ వెర్షన్ జెట్టా లీటరుకు 16.96 కి.మీ. మైలేజీనిస్తుంది.
దేశీయ విపణిలో కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్ ధరలు రూ.13.70 లక్షల నుంచి రూ.19.43 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








