వెంటో స్టైల్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన ఫోక్స్‌‌వ్యాగన్

By Ravi

గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో, కార్ల తయారీ సంస్థల తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు స్పెషల్ ఎడిషన్లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న మోడళ్లకు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్‌లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

'వెంటో స్టైల్' (Vento Style) పేరుతో లభ్యం కానున్న స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో స్టైల్ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, ఫ్లోర్‌మ్యాట్స్, లెథర్ సీట్ కవర్స్, కారుకు ముందు వైపు, వెనుక వైపు మరియు పక్కన భాగాల్లో క్రోమ్ ట్రిమ్, స్పెషల్ డోర్ సిల్స్ (లోపలి డోర్ హ్యాండిల్స్) వంటి అదనపు ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

పెట్రోల్ వెర్షన్ వెంటో స్టైల్ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.33 లక్షలుగా ఉండగా, డీజిల్ వెర్షన్ వెంటో స్టైల్ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.9.41 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Volkswagen Vento

More from DriveSpark

Article Published On: Tuesday, April 16, 2013, 14:28 [IST]
English summary
German carmaker Volkswagen has launched a special edition version to its Vento. The Volkswagen Vento Style limited edition is available on both the petrol and diesel versions of the car in Trendline and Comfortline trim levels. The Vento Style edition comes with additional equipment like alloy wheels, floor mats, leather seat covers, chrome trim on the front, sides and the rear and special door sills.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+