పూర్ సేల్స్.. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ మార్కెట్ నుంచి తొలగింపు
అమ్మకాలు సరిగ్గా లేని కారణంగా హోండా కార్స్ తమ అకార్డ్ లగ్జరీ సెడాన్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించినట్లుగానే, తాజాగా జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా దేశయ మార్కెట్ నుంచి తమ లగ్జరీ కారు పస్సాట్‌ను తొలగించి వేసింది. గడచిన రెండు నెలలుగా ఒక్క పస్సాట్ కారు కూడా అమ్ముడుపోలేదు. జూన్-నవంబర్ 2013 కాలంలో కేవలం 235 యూనిట్ల ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించాలని ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయించుకుంది.
ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌లో 2 లీటర్ (1968సీసీ) 4-సిలిండర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 170 పిఎస్‌ల శక్తిని, 1,750-2,000 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లూమోషన్ టెక్నాలజీతో లభించే పస్సాట్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. దీని బూట్ స్పేస్ సామర్థ్యం 565 లీటర్లు.

బ్లూమోషన్ టెక్నాలజీలో ఉండే స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్, డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌ల ద్వారా కొత్త ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుతో మెరుగైన మైలేజ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, టొయోటా కరోలా, నిస్సాన్ టియానా, స్కొడా సూపర్బ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. భారత మార్కెట్లో పస్సాట్ ధర రూ.25 లక్షలకు పైనే ఉంది.


Click it and Unblock the Notifications








