పవర్‌ఫుల్ ఇంజన్‌తో రానున్న ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్‌లో అప్‌‌గ్రేడెడ్ వెర్షన్ వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ మోడల్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో పోలో జిపి పేరుతో అమ్ముడుపోతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌లో ఎక్స్టీరియర్స్ పరంగా కొత్త బంపర్స్, కొత్త హెడ్‌లైట్స్, గ్రిల్ వంటి చిన్న మార్పులు తప్ప, పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

అయితే, యాంత్రికపరమైన మార్పులు మాత్రం ఉండే అవకాశం ఉంది. కొత్త అప్‌గ్రేడెడ్ పోలో కారులో మరింత శక్తివంతమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ కారులో ఉపయోగిస్తున్న 1.6 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌కు రీట్యూన్ చేయబడ్డదే ఈ కొత్త 1.5 లీటర్ ఇంజన్.

Volkswagen Polo

చిన్న కార్లుపై (పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువ, ఇంజన్ సామర్థ్యం 1.5 లీటర్స్ కన్నా తక్కువగా ఉండే కార్లను చిన్న కార్లుగా పరిగణిస్తారు) భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీని పొందేందుకే కంపెనీ ఈ కొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.

ఈ కొత్త 1.5 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి, 104 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసేలా రెండు ఇంజన్లుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న 1.2 లీటర్, 1.6 లీటర్ డీజిల్ ఇంజ్లన స్థానంలో ఈ కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో స్టాండర్డ్ పోలో 89 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంటే, పవర్‌ఫుల్ పోలో 104 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 21, 2013, 14:56 [IST]
English summary
Earlier this week the first rumor surrounding the VW Polo GT diesel emerged. Reports stated that VW was looking to introduce the most powerful Polo hatchback yet, powered by the 1.6 liter diesel engine from the VW Vento sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+