రూమర్: ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐ లాంచ్!
హై పెర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్‌లను డ్రైవ్ చేయటం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది, ప్రత్యేకించి సిటీ డ్రైవ్స్, వీకెండ్స్‌లో లాంగ్ డ్రైవ్స్‌లో వీటిని వినియోగం మరింత ఉత్సాహాన్నిస్తుంది. అయితే, వీటి ధర కూడా అధికంగానే ఉంటుంది. అందుకే భారత్‌లో అనేక కార్ల తయారీ సంస్థలను ఇలాంటి కార్లను ఇక్కడి మార్కెట్లలో విడుదల చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటాయి.
కానీ జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రం ఇందుకు భిన్నంగా భారత్‌లో హైపెర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించేందుకు ముందుకు వస్తోంది. గడచిన మే నెలలో పవర్‌ఫుల్ పోలో 1.2 జిటి టిఎస్ఐ (పెట్రోల్ వెర్షన్) కారును విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, ఇప్పుడు డీజిల్ వెర్షన్‌లో కూడా పవర్‌ఫుల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ కారులో 1.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ కలిగిన వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్‌ను ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కొడా ర్యాపిడ్ వంటి సెడాన్లలో ఉపయోగిస్తున్నారు. వెంటోలో ఉపయోగించిన ఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 105 హార్స్ పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, కంపెనీ ప్రవేశపెట్టిన పవర్‌ఫుల్ పెట్రోల్ వెర్షన్ పోలోలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రం 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేశారు. ఈ పెట్రోల్ వెర్షన్ ధరే రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే పోలో 1.6 జిటి టిడిఐ ధర మరింత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








