ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐపై భారీ డిస్కౌంట్
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన జిటి వెర్షన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పవర్‌ఫుల్ 'పోలో 1.6 జిటి టిడిఐ' వేరియంట్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. భారత మార్కెట్లో తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ తమ పోలో మోడల్‌లో వివిధ వేరియంట్లను (పవర్‌ఫుల్ జిటి టిఎస్ఐ, జిటి టిడిఐ, క్రాస్ పోలో) ఆఫర్ చేస్తోంది.
కానీ, వీటి అధిక ఇవి అమ్మకాల పరంగా ప్రోత్సాహకర ఫలితాలను కనబరచలేదు. దీంతో పోలో సేల్స్‌ను పెంచుకునేందుకు జిటి టిడిఐ వేరియంట్‌పై కంపెనీ వివిధ బెనిఫిట్లను ఆఫర్ చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ సెప్టెంబర్ నెలలో కొత్త పోలో 1.6 జిటి టిడిఐ వెర్షన్‌ను రూ.8.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు విడుదల చేసింది.

ఇప్పుడు ఈ మోడల్‌పై రూ.25,000 నగదు తగ్గింపును, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, మూడేళ్ల పాటు ఉచిత బీమాను, మూడేళ్ల పాటు అధనపు వారంటీని, మూడేళ్ల పాటు ఉచిత మెయింటినెన్స్ మరియు మూడేళ్ల పాటు ఉచిత 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను కూడా ఫోక్స్‌వ్యాగన్ అందిస్తోంది.
కొన్ని డీలర్‌షిప్ కేంద్రాల్లో క్రాస్ పోలో వేరియంట్‌పై కూడా రూ.15,000 వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆఫర్లన్నీ కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తే మాత్రమే వరిస్తాయట.


Click it and Unblock the Notifications








