ఫోక్స్‌వ్యాగన్ పూనే ప్లాంటులో 3,00,000వ కారు ఉత్పత్తి

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ పూనే ప్లాంటులో 3,00,000వ కారును ఆగస్ట్ 5, 2013న ఉత్పత్తి చేసింది. ఈ జర్మన్ ఆటో దిగ్గజం భారత మార్కెట్లో తయారు చేసిన ఉత్పత్తులను కేవలం దేశీయ మార్కెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, సమీప పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.

పూనే ప్లాంటులో తయారైన 3,00,000వ కారు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ వెంటో. ఏజిసిసి మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు ఇక్కడి ప్లాంటులో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ సిస్టమ్ కార్లను ఉత్పత్తి చేస్తారు. ఫోక్స్‌‌వ్యాగన్ ఇండియా తమ పూనే ప్లాంటులో హై క్వాలిటీ ప్రొడక్షన్ నిబంధనలను పాటిస్తూ, కేవలం దేశీయ వినియోగదారులను సంతృప్తిపరచడమే కాకుండా, ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో 30 దేశాలకు పైగా ఇక్కడ ఉత్పత్తి కార్లను ఎగుమతి చేస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సాధించగలింది. 2007లో పూనే ప్లాంటు నిర్మాణం ప్రారంభమైంది. మే 2009లో ఈ ప్లాంటులో ఉత్పత్తి షురూ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఫోక్స్‌వ్యాగన్ పొలో, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కొడా ఫ్యాబియా, స్కొడా ర్యాపిడ్ కార్లను తయారు చేస్తున్నారు.

Volkswagen Pune Plant

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2013, 10:38 [IST]
English summary
Volkswagen India has touched a historic milestone in the country. It has produced the 3,00,000th car from its Pune Plant on August 5, 2013. The car is a left hand drive version of Volkswagen Vento that will be exported to the AGCC market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+