విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ వెంటో టిఎస్ఐ
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవలే పోలో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ జిటి వెర్షన్లను ప్రవేశపెట్టినట్లుగానే దాని సెడాన్ వెర్షన్ వెంటోలో కూడా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగిన పవర్‌ఫుల్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. అయితే, ఇదివరకు చెప్పుకున్నట్లుగా, దీనిని వెంటో జిటి టిఎస్ఐ అని కాకుండా కేవలం వెంటో టిఎస్ఐ అని మాత్రమే పిలువనున్నారు.
ఫోక్స్‌వ్యాగన్ వెంటో టిఎస్ఐ సెడాన్ కూడా తొలుతగా పెట్రోల్ వెర్షన్‍లో విడుదల కానుంది. పోలో జిటి టిఎస్ఐ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 17.84 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 16.93 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. (ఆటోమేటిక్ వెర్షన్ ఇంత అధిక మైలేజీనివ్వటం చెప్పుకోదగిన విషయం). పవర్‌ఫుల్ ఇంజన్‌తో వస్తున్న ఈ ఫోక్స్‌వ్యాగన్ వెంటో టిఎస్ఐ సెడాన్ మంచి పెర్ఫామెన్స్‌ను, స్పోర్టీ ఫీల్‌ను ఆఫర్ చేయనుంది. వెంటో టిఎస్ఐలో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








