తమిళనాడు వోల్వో బస్సుల్లో 'హైటెక్ సేఫ్టీ ఫీచర్స్'

By Ravi

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన వరుస వోల్వో బస్సు ప్రమాదాలతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. ఇకపై తమ రాష్ట్రంలో నడిపే అన్ని ప్రభుత్వ వోల్వో బస్సుల్లో 'హెటెక్ సేఫ్టీ ఫీచర్ల'ను ఇన్‌స్టాల్ చేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర రవాణా అధికారులకు మరియు వోల్వో ప్రతినిధుల బృందానికి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, తమిళనాడు వోల్వో బస్సులు క్రింద పేర్కొన్న అధునాత సేఫ్టీ ఫీచర్లను అమర్చేందుకు వోల్వో అంగకీరించింది. అవి..

  • ఫైర్ రెసిస్టెంట్ ఎలక్ట్రానిక్ ఈవెంట్ రికార్డ్ (విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్ లాంటి పరికరం, ఇది బస్సులో మాట్లాడే వ్యక్తుల/డ్రైవర్ల సమాచారాన్ని రికార్డు చేస్తుంది మరియు ఇది మంటల్లో కాలిపోకుండా ఉంటుంది).
  • స్పీడ్ గవర్నర్స్ (ఇవి వేగాన్ని నియంత్రిస్తాయి. వీటిని అమర్చడం వలన బస్సు గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఫలితంగా డ్రైవర్ బస్సును ఓవర్‌స్పీడ్‌తో నడిపే అవకాశం ఉండదు).
  • స్మోక్ డిటెక్టర్స్ (బస్సులో పొగరావటాన్ని గుర్తించి అలార్ మోగే సేఫ్టీ సిస్టమ్).
  • అన్ని అద్దాలను పగులగొట్టవచ్చు (ప్రస్తుతం వోల్వో బస్సుల్లో కేవలం నాలుగు అద్దాలను (కుడివైపు రెండు, ఎడమవైపు రెండు) పగులగొట్టే అవకాశం ఉంది. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో అన్ని అద్దాలను పగులగొట్టే వెసలుబాటును కల్పించనున్నారు).
  • సుత్తుల (హ్యామర్స్) సంఖ్యను నాలుగు నుంచి ఎనిమిదికి పెంపు (ప్రస్తుతం వోల్వో బస్సులు అద్దాలను పగులగొట్టేందుకు నాలుగు సుత్తులును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇకపై వీటి సంఖ్యను ఎనిమిదికి పెంచనున్నారు).
  • రేడియం స్టిక్కర్స్ (రాత్రివేళ్లలో కూడా స్పష్టంగా ప్రకాశిస్తూ, అత్యవసర ద్వారాలకు దారిచూపే రేడియం స్టిక్కర్స్‌ను ఉపయోగించనున్నారు).

Volvo Bus
వోల్వో బస్సుల్లో ఈ హైటెక్ సేఫ్టీ ఫీచర్లకు అదనంగా, బస్ ఆపరేటర్లు క్రింద పేర్కొన్న కొత్త నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. అవి..
  • వోల్వో బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఒక డ్రైవర్ వరుసగా 150 కిలోమీటర్ల దూరానికి మించి నడపకూడదు.
  • ప్రతి సీటులో అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన సేఫ్టీ మరియు ఎమర్జెన్సీ విధానాన్ని వివరించే మ్యాన్యువల్స్‌ను కంపెనీ, ఆపరేటర్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి.
  • అంతేకాకుండా, బస్సు ప్రయాణం ప్రారంభం కావటానికి ముందుగా, బస్ ఆపరేటర్లు సేఫ్టీకి సంబంధించిన వీడియోని కూడా ప్రదర్శించాలి.

వోల్వో తరహాలోనే అశోక్ లేలాడ్, టాటా, ఐషర్, డైమ్లర్ వంటి ఇతర బస్ తయారీదారులతోను సమావేశాలు నిర్వహించి సేఫ్టీ నిబంధనలు కఠినతరం చేస్తామని తమిళనాడు ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ప్రభాకర్ రావ్ వెల్లడించారు. తమిళనాడు తీసుకున్న తాజా నిర్ణయంతో, లగ్జరీ బస్సుల్లో కొత్త సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేయనున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఇది నిలిచిపోనుంది. దేశంలోని మరిన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తాయని ఆశిద్దాం..!

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2013, 18:14 [IST]
English summary
New safety features will soon be put in place in all Volvo buses in Tamil Nadu. The decision was taken post a meeting held between the Tamil Nadu state transport officials and representatives from Volvo on Thursday. The development comes in the light of the recent accidents involving Volvo buses which caught fire resulting in deaths of several passengers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+