సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ జట్టుతో వోల్వో జోడీ!
స్వీడన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ కంపెనీ వోల్వో కార్స్ ఇండియా ఇప్పుడు ఐపిఎల్‌తో జతకట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫీవర్ నెలకొని ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, వోల్వో కార్స్ ఇండియా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం 'సన్‌రైజర్స్ హైదరాబాద్' జట్టుతో జతకట్టింది.
ఐపిఎల్ 2013 కోసం ఈ జట్టుకు వోల్వో అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. వోల్వో ఇప్పటికే గోల్ఫో టోర్నమెంట్స్, చెన్నై ఓపెన్ వంటి స్పోర్టింగ్ ఈవెంట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. వోల్వో కార్స్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు లగ్జరీ కార్లను అందిస్తోంది.
అవి.. 7-సీటర్ లగ్జరీ ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సి 90, కాంపాక్ట్ ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సి 60, లగ్జరీ సెడాన్ ఎస్ 80, స్పోర్టీ సెడాన్ ఎస్ 60 మోడళ్లను అందిస్తోంది. ఇటీవలే వోల్వో ఆవిష్కరించిన వి40 క్రాస్ కంట్రీని కూడా కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది.
వోల్వో కార్స్ ఇండియా కీలక మార్కెట్లలో హైదరాబాద్ మార్కెట్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో, ఐపిఎల్ 2013 ద్వారా కొనుగోలుదారులకు మరింత చేరువయ్యేందుకు ఈ స్పాన్సర్‌షిప్‌ను తీసుకున్నామని వోల్వో పేర్కొంది.



Click it and Unblock the Notifications








